
భూత్పూర్, సెప్టెంబర్ 12 : సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఇప్పటికే పాలమూరు ఎంతో అభివృద్ధి చెందినదని, ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అమిస్తాపూర్ శివారులోని వాసవీ గార్డెన్లో ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ నూతన అధ్యక్షుడు, కార్యవర్గసభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా గుండ వెంకటేశ్, ప్రధానకార్యదర్శిగా వేణుగోపాల్, కోశాధికారిగా నాగరాజు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా చక్రధర్గుప్తా, ఆలయ అభివృద్ధి చైర్మన్ విజయ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా విశ్వనాథం జానకీరాములు, మీడియా ఇన్చార్జిగా ప్రమోద్‌కుమార్, శాశ్వత పూజ ఆర్గనైజర్‌గా పల్ల శ్రీనివాసులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజప్రతాప్, ఇల్లూరి వెంకట్రామయ్య, కలకొండ సూర్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్లుగా గుద్దేటి శివప్రసాద్, కలకొండ రాఘవేంద్రగుప్తా, గుద్దేటి దేవకుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఆ దిశగానే సంక్షేమ పథకాల అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, శివకుమార్‌తోపాటు ఆ సంఘం సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
కవులు, కళాకారులకు పుట్టినిల్లు
మహబూబ్‌నగర్, సెఫ్టెంబర్ 12 : కవులు, సాహితీవేత్తలు, కళాకారులకు పాలమూరు పుట్టినిల్లని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా సమాఖ్య సాంస్కృతిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ 108వ జయంతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ్ణన్ 133వ జయంతి, తెలంగాణ సాహితీ దిగ్గజం యశోదారెడ్డి సాహితీ పురస్కారాలు, ్రప్రైవేటు పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ కవి మేడ్చల్ అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, జాతీయ కవి డాక్టర్ పొద్దుటూరి ఎల్లారెడ్డి, ప్రముఖ కవయిత్రి, అవధాని చుక్కయ్యపల్లి శ్రీదేవి, ప్రముఖ కవయిత్రి రూపాదేవి, భీంపల్లి శ్రీకాంత్ ఉన్నారు.
ప్రణాళికాబద్ధ్దంగా విస్తరణ చేపట్టాలి
రోడ్డు విస్తరణతోపాటు జంక్షన్ల అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధ్దంగా చేపట్టాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌లోని జంక్షన్ విస్తరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వెంకటాద్రినగర్‌లో రూ.15లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ ఛైర్మన్ గణేశ్, కౌన్సిలర్ పటేల్ ప్రవీణ్‌కుమార్, వార్డు కమిటీ అధ్యక్షుడు విష్ణువర్ధ్దన్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రసన్న తదితరులు ఉన్నారు. అనంతరం వార్డు నెంబర్ 5లో ఎస్సీ కమ్యూనిటీ శ్మశాన వాటికకు కంపౌండ్‌వాల్, అంగన్వాడీ కేంద్రం భవనాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. వార్డు నెంబర్ 2లో పార్టీ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 12: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని అబ్కారీ, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్(ట్రస్మా) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ట్రస్మా అధ్యక్షుడు ప్రభాకర్జీ అధ్యక్షతన ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎవరు ఎలాంటి ఉన్నత హోదాలో ఉన్నా గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్నవారేనన్నారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని , విద్యార్థులకు చదువుతో పాటు, సంస్కారాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్లకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సన్మానించండం అభినందనీయమన్నారు. ట్రస్మా ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, రాంచందర్‌జీ, మాధవి,సురేందర్, హరినాథ్, మాన్చంద్ తదితరులు పాల్గొన్నారు.