
మహబూబ్నగర్టౌన్, సెప్టెంబర్ 12: 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ‘నీట్’ ప్రశాంతంగా ముగిసింది. ఉ మ్మడి జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో కేంద్రీయవిద్యాలయ, చైతన్యసెంట్రల్, సమర్థ, శ్లోకా, మౌంట్బాసిల్, గీతాశ్రీ స్కూల్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 9 కేంద్రాల్లో 3,213 మం ది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, వీరిలో 3,097పరీక్షకు హాజరుకాగా, 116 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.