
కృష్ణ, సెప్టెంబర్ 12 : మండలంలోని గుడెబల్లూర్లో ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు అర్చన లు, అభిషేకాలు, నైవేద్యం, హారతి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రజలకు అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో గ్రా మస్తులు పాల్గొన్నారు.
పూజలందుకుంటున్న గణపతులు
మరికల్, సెప్టెంబర్ 12 : వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో గణపతుల విగ్రహ ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని అప్పంపల్లిలో ఏర్పాటు చేసిన వినాయకుడికి సర్పంచ్ తిరుపతిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించామని పే ర్కొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మండలకేంద్రంలో మూడు చోట్ల ఏర్పా టు చేసిన వినాయకులను నిమజ్జనానికి తరలించారు. కా ర్యక్రమంలో నాయకులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నీలకంఠ స్వామి ఆలయంలో…
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 12 : పట్టణంలోని బారంబావి నీలకంఠస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద భక్తులకు అన్నదా న కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి అభిషేకం, బిల్వార్చన, పుష్పాభిషేకం, నైవేద్యం, మహామంగళ హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బాలరాజు, చంద్రశేఖర్, కార్యదర్శి దత్తు, కోశాధికారి నర్సింహులు, భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని 2వ వార్డులో రామ్మందిర్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని కౌన్సిలర్ అనిత ప్రారంభించారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు, రామ్ మంది ర్ యువసేన కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో…
నారాయణపేట, సెప్టెంబర్ 12 : పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మం డపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎస్పీ చేతన ప్రారంభించారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వినాయక నవరా త్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కో రారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ (డీఏఆర్) భర త్, ఆర్ఐ కృష్ణయ్య, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, పట్టణ ప్రజ లు పాల్గొన్నారు.