
జడ్చర్లటౌన్, సెప్టెంబర్12 : గణేశ్ ఉత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. జడ్చర్ల మున్సిపాలిటీలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథుడికి ఆదివారం భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా వినాయక మండపాలవద్ద భక్తులు కోలాటాలు, దాండియా ఆడడంతోపాటు భక్తిగీతాలు ఆలపించారు. వినాయక మండపాల వద్ద యువకుల సందడి కనిపించింది.
మున్సిపల్ చైర్మన్ పూజలు
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 12 : జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి శ్రీరామ్‌కాలనీలో కొలువుదీరిన గణనాథుడిని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ రామాంజనేయులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాలనీవాసులు శాంతిభూషణ్, నరేందర్, సునీల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నిరంజన్, లింగంగౌడ్ పాల్గొన్నారు.
భక్తులకు అన్నదానం
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 12 : అడ్డాకుల మం డలకేంద్రంతోపాటు పొన్నకల్, కందూరు, శాఖాపూర్, పెద్దమునగల్‌చేడ్, రాచాల తదితర గ్రామాల్లో గణనాథుడికి ప్ర త్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదా న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మూసాపేట, నిజాలాపూర్, నందిపేట, జానంపేట, వేముల, కొ మిరెడ్డిపల్లి, సంకలమద్ది గ్రామాల్లో గణేశ్ మండపాలవద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, సెప్టెంబర్ 12 : మండలకేంద్రంతోపాటు, బోయిన్పల్లి, వాడ్యాల్, మల్లాపూర్, రాణిపేట, వేముల, కొత్తపల్లి తదితర గ్రామాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు తదితర కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు.
దేవరకద్ర, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 12 : దేవరక ద్ర, చిన్నచింతకుంట మండలాల్లో గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల చెన్నకేశవస్వామి ఆలయం, బస్వాయిపల్లి గ్రామంలో గణనాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బస్వాయిపల్లిలో వేణుసాగర్ భక్తులకు అన్నదానం చేశారు. అదేవిధంగా ఆలయంలో ప్రతిరోజు భజనలు చేసే 20మంది భజనపరులను మండల కోఆప్షన్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఘనంగా నిమజ్జనోత్సవం
గండీడ్, సెప్టెంబర్ 12 : మండలంలోని వెన్నాచేడ్ శివాలయంలో ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అంతకుముందు లడ్డూ వేలం నిర్వహించగా, అదే గ్రామానికి చెందిన మంగలి బందెయ్య రూ.41వేలకు దక్కించుకున్నారు. అనంతరం గ్రామంలో గణనాథుడి ఊరేగింపు నిర్వహించి పెద్దచెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వెంకటయ్య, మంగలి మహేందర్, నరేశ్, నాగేంద్రకుమార్, బందెయ్య, కేశవులు, మంగలి రమేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
గణపయ్యకు ఎమ్మెల్యే ఆల పూజలు
భూత్పూర్, సెప్టెంబర్ 12 : మండలంలోని కొత్తమొల్గరలో ప్రతిష్ఠించిన గణనాథుడికి ఆదివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దైవచింతనను అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సాయిలు, సత్యనారాయణ, అశోక్, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.