
భూత్పూర్, ఆగస్టు 12 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీలోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గానికి చెందిన 120మందికి రూ.28లక్షల 28వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గతం లో సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు ఎమ్మెల్యే బంధువులకో, మంత్రుల చుట్టాలకో వచ్చేవని, తెలంగాణ వచ్చాక ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ సీఎం సహాయనిధితో అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం ముగ్గురు పీఏలను నియమించినట్లు ఎమ్మెల్యే ఆల తెలిపారు. ప్రజా సంక్షేమంకోసం అహర్నిశలు పని చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
ఆర్యసమాజం మానవత్వ విలువలు నేర్పుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ గ్రామంలో పునర్నిర్మించిన ఆర్యసమాజం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించారు. అనంతరం దయానంద విద్యామందిర్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒకప్పుడు గురుకులాలు, ఆర్యసమాజ పాఠశాలలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేవని తెలిపారు. దయానంద విద్యామందిర్‌లో తరగతి గదుల నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
యువత చెడు అలవాట్లను వీడి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ఎమ్మెల్యే ఆల కోరారు. అమిస్తాపూర్‌లో నేతాజీ యు వజన వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు కదిరె శేఖర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, వైస్‌చైర్మన్ కెంద్యా ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌ డ్, సింగిల్‌విండో చైర్మన్ కదిరె అశోక్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, లక్ష్మీనర్సింహయాద వ్, మురళీధర్‌గౌడ్, అశోక్‌గౌడ్, బోరింగ్ నర్సింహులు, ప్రే మ్‌కుమార్, ఆర్యసమాజం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రధాన్ విఠల్‌రావుఆర్య, సాయిలు, చంద్రయ్య, జయశంకర్ఆర్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్, సురేందర్‌గౌడ్, నర్సింహులు, రవి పాల్గొన్నారు.