
మహబూబ్‌నగర్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఎంపీలతో జరిగే సమావేశం మొక్కుబడిగా మారుతున్నది. ప్రతిసారీ ఎంపీలను ఆహ్వానించడం, వినతులు స్వీకరించడం మినహా రైల్వే అధికారులు చేసేదేమీ లేదు. 2019 సమస్యలే ఇప్పుడు చెప్పాల్సి వస్తోందని.. కానీ, సమస్యలు అలాగే ఉన్నాయని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ఇద్దరు ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో జరిగిన సమావేశంలో మరోమారు ఉమ్మడి జిల్లా రైల్వే సమస్యలపై జీఎం గజానన్ మాల్యా దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు రైల్వే సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రైల్వే పరంగా జరుగుతున్న అన్యాయాన్ని సమావేశంలో ప్రస్తావించారు.
ఆది నుంచి అదే తీరు..
తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వైఖరి మొదటి నుంచి నిర్లక్ష్యం గా మారింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రైల్వే పరంగా ఈ ప్రాంతానికి అన్యాయమే జరుగుతున్నది. ఇదే అంశంపై ఎంపీలు రైల్వే అధికారుల తీరును తూర్పారబట్టారు. రైల్వే అధికారుల తీరు ఎంతో నిర్లక్ష్యం గా ఉందని ఎంపీ రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కేంద్రం చెప్పేదానికి వాస్తవ పరిస్థితికి పోలికే లేకుండా పోయిందన్నారు. 2019లో ఎంపీలతో జరిగిన సమావేశంలో పెట్టిన ఎజెండానే మళ్లీ ఇ ప్పుడు కూడా పెట్టారని తెలిపారు. రెండేండ్లుగా రైల్వే పరంగా ఉమ్మడి జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. దేశంలోనే అత్యధిక ఆదాయం అందిం చే దక్షిణ మధ్య రైల్వేపై కేంద్రం, అధికారులు శీతకన్ను వేస్తున్నారు. తెలంగాణకు కొత్త రైళ్లు కానీ, కొత్త లైన్లు కానీ కేటాయించకుండా అన్యాయానికి గురి చేస్తున్నారు. ఉత్తరాదికి బుల్లెట్ రైళ్లిచ్చి.. మనకు ప్యాసెంజర్ రైళ్లు కూడా ఇవ్వడం లేదు. ఎనిమిదేండ్ల కిందట ప్రారంభించిన గ ద్వాల- రాయిచూరు రైల్వే లైన్లో నేటికీ వేళాపాళాలేని ఒక్క డెమో రై లు మాత్రమే నడుస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. 2020 డిసెంబర్ నాటికే పూర్తి కావాల్సిన కాచిగూడ-మహబూబ్‌నగర్ డబ్లింగ్ ఇం కా పూర్తి కాలేదు. దేవరకద్ర-మునీరాబాద్ రైల్వేలైన్ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. 50 ఏండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన గ ద్వాల-మాచర్ల రైల్వే లైన్ ఊసే లేదు. కొత్త జిల్లాలైన వనపర్తి, నాగర్‌కర్నూల్‌కు రైలు సదుపాయం కల్పించే ఈ లైన్ గురించి ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించినా నేటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు.
50 ఏండ్లుగా ప్రతిపాదనలకే..
రైల్వే సమస్యలపై దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వినతి పత్రం అందించాం. గ ద్వాల-మాచర్ల రైల్వే లైన్ 50 ఏండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. పార్లమెం ట్ సాక్షిగా ఈ రైల్వేలైన్ కోసం మంత్రి హా మీ ఇచ్చినా.. కనీసం ఈ అంశంపై రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. గద్వాల-రాయిచూరు లైన్ ప్రారంభమై ఎనిమిదేండ్లు గడిచినా ఇప్పటికీ ఒక్క రైలు మాత్రమే నడుస్తున్నది. ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచడంతోపాటు వాటి వేళలు ప్రయాణికులకు అనుకూలంగా మార్చాలి. గద్వాల రైల్వేస్టేషన్ వద్ద రైల్వే శాఖకు ఉన్న 200 ఎకరాల్లో దవాఖాన, ట్రైనింగ్ సెంటర్ లేదా మాన్యు ఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మించి యువతకు ఉపాధి కల్పించాలి. జోగుళాంబ హాల్ట్ వద్ద ఆర్వోబీ నిర్మించాలి. తాగునీటి ఏర్పాటుతోపాటు మౌలిక వసతులు కల్పించాలి. గద్వాల రైల్వేస్టేషన్లో వైన్ గంగ, కొంగు ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలి. విజ్ఞప్తులు స్వీకరించడమే కాకుండా వాటి అమలుపై రైల్వే అధికారులు దృష్టి సారించాలి.
మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి..
రైల్వేస్టేషన్లలో మౌలిక వసతుల కల్పనలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉంది. ఈ అం శంపై ప్రత్యేక దృష్టి సారించాలి. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్లో కొత్త ఫుట్ ఓ వర్ బ్రిడ్జి, లిఫ్ట్, ఎస్కలేటర్ ఇతర మౌలి క వసతులు కల్పించాలని కోరాం. ప్ర యాణికులకు వైఫై సౌకర్యం అందించాల ని విజ్ఞప్తి చేశాం. నిర్మాణంలో ఉన్న ఆర్యూబీ, ఆర్వోబీలను త్వరగా పూర్తి చేయాలి. దేవరకద్ర ఆర్వోబీ ప నులు పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నారాయణపే ట, కొడంగల్, వనపర్తి ప్రజలకు అనుకూలంగా ఉన్నందున వెంకటాద్రి, ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లు వనపర్తి రోడ్, దేవరకద్ర స్టేషన్లలో ఆపాలి. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశాం.