
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
అలరించిన చిన్నారుల వేషధారణ
ఉత్సాహంగా ఉట్లు కొట్టిన యువత
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. పలుచోట్ల నిర్వహించిన ఉట్లుకొట్టే కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మహబూబ్‌నగర్, ఆగస్టు 30 : కృష్ణాష్టమి వేడుకలను జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పలు గ్రామాల్లో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు. జిల్లాకేంద్రంలోని కృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్ల, ఆగస్టు 30 : జడ్చర్ల మున్సిపాలిటీలోని బ్రహ్మకుమారి రాజయోగ కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్‌రెడ్డిని పూలమాల, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారి సుజ్ఞాని, ప్రభ, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, ఆగస్టు 30 : దేవరకద్ర మండలకేంద్రంతోపాటు కౌకుం ట్ల, లక్ష్మీపల్లి, చిన్నరాజమూరు, చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తిస్వా మి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 30 : అడ్డాకుల, మూసాపేట మండలాల్లో కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అడ్డాకుల, కందూరు, పొన్నకల్, పెద్దమునగల్‌చేడ్, శాఖాపూర్, రాచాల, మూసాపేట, నిజాలాపూర్, నందిపేట, జానంపేట, వేముల, పో ల్కంపల్లి తదితర గ్రామాల్లో యా దవ సంఘాల ఆధ్వర్యంలో కృష్ణుడి విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఉట్లు కొట్టేందుకు యువత పోటీ పడ్డారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఆగస్టు 30 : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు. అలాగే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
మహ్మదాబాద్, గండీడ్ మండలాల్లో..
మహ్మదాబాద్/గండీడ్, ఆగస్టు 30 : కృష్ణాష్టమి వేడుకలను ఉమ్మడి మండలంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, ఆగస్టు 30 : మండలకేంద్రంతోపాటు యన్మన్గండ్ల, కొల్లూరు, కారుకొండ, ఇప్పటూర్, కొండాపూర్ తదితర గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. కొల్లూరు, నవాబ్‌పేట, యన్మన్గండ్ల గ్రామాల్లో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు సౌజన్యరఘు, గోపాల్‌గౌడ్, హన్మంతుజయమ్మ, లక్ష్మమ్మ, బొజ్జమ్మ యాదయ్య, చందర్‌నాయక్, నాగ నర్సింహులు, రఘు, చందు పాల్గొన్నారు.