
ప్రజావాణిలో కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, ఆగస్టు 30 : ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఇకనుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారమార్గం చూపాలన్నారు. మండలస్థాయిలోనూ ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.