హైవేకు సర్వే షురూ..
సోమశిల-సిద్దేశ్వరం వంతెన, హైవే నిర్మాణానికి అడుగులు
కొల్లాపూర్ ప్రాంతంలో కొనసాగుతున్న డ్రోన్ సర్వే
నెరవేరబోతున్న కొల్లాపూర్ ప్రాంత ప్రజల స్వప్నం
కొల్లాపూర్, సెప్టెంబర్ 3 : కొల్లాపూర్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన సోమశిల-సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కల్వకుర్తి (ఎన్‌హెచ్-167) నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, సోమశిల, ఏపీలో మాడ్గుల, శివపురం, ఆత్మకూరు, నంద్యాల (ఎన్‌హెచ్-340సీ) సమీపంలోని కర్వెన వరకు సుమారు 185.90 కిలోటర్ల మేర హైవే నిర్మించనున్నారు. అయితే ఇది వరకే సర్వే పనుల కోసం రూ.29 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దశాబ్దాల తర్వాత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పట్టుదల, కృషి ఫలితంగా కొల్లాపూర్ వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. శుక్రవారం కొల్లాపూర్-రామాపూర్ గ్రామాల మధ్య జాతీయ రహదారి నిర్మాణం కోసం పూణెకు చెందిన టీపీఎఫ్ ఇంజినీరింగ్ ప్రైవేటు లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన స్నేహ కిరణ్ టెక్నో కన్సల్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలు డ్రోన్ సాయంతో సర్వే పనులు మొదలుపెట్టాయి. సర్వే జరుగుతుందన్న సమాచారం తెలుసుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జాఫర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నిరంజన్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి చింతకుంట రాఘవేంద్రలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అయితే ఈ హైవే ఏ మార్గం మీదుగా వెళ్తుందోన ని స్థానికులు నిరీక్షిస్తున్నారు.