
గ్రామాల్లో రెపరెపలాడిన గులాబీ జెండా
ఉత్సాహంగా పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 2 : టీఆర్ఎస్ జెండాపండుగను ఊరూరా ఉత్సాహంగా నిర్వహించా రు. జెండాపండుగలో టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని సంబురాలు జరుపుకొన్నారు. అ న్ని గ్రామాల్లో గులాబీజెండాను ఎగురవేసి జై తె లంగాణ నినాదాలు చేశారు. అలాగే స్వీట్లు పంచుకున్నారు. జడ్చర్ల మండలంలోని బూర్గుపల్లి, ఆల్వాన్‌పల్లి, లింగంపేట, కోడ్గల్ గ్రామాల్లో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి గులాబీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సంగీత,నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 2 : ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపుమేరకు అడ్డాకుల మండలంలోని గ్రామాల్లో పార్టీ ముఖ్యనాయకు లు గులాబీ జెండా ఎగురవేశారు. అనంతరం అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు మండలకేంద్రానికి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే బస్టాండ్ ఆవరణలో గులాబీ జెండా ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, సర్పంచుల సంఘం మండల అద్యక్షుడు జ యన్నగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, ఉద్యమకారుడు భీమన్నయాదవ్, సర్పంచ్ మం జులాభీమన్నయాదవ్, ఎంపీటీసీ రంగన్నగౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రా మ కమిటీల ఆధ్వర్యంలో గులాబీ జెండా పండుగ నిర్వహించారు. అనంతరం సర్పంచులు, ఎంపీటీసీలు మూసాపేట బస్టాండ్ ఆవరణకు చేరుకొని టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ రఘుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, స ర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు జమీర్ పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, సెప్టెంబర్ 2 : మండలంలో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించా రు. మద్దిగట్ల, కొత్తమొల్గర, తాటిపర్తి, అన్నాసాగర్, కరివెన గ్రామాల్లో డప్పులు కొడుతూ, పటాకులు కాలుస్తూ గులాబీ జెండా ఎగురవేశారు. అలాగే మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ము న్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ సమక్షంలో బీజేపీ నాయకుడు రాములు టీఆర్ఎస్లో చేరా రు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాకేశ్, సిం గిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహగౌడ్, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్, మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ పాల్గొన్నారు.
దేవరకద్ర, సీసీ కుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 2 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో గులాబీ జెండా పండుగను సంబురంగా జరుపుకొన్నారు. దేవరకద్ర మండలంలోని నాగారం, బస్వాపూర్, నార్లోనికుంట్ల, గద్దెగూడెం తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు గులాబీ జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో దేవరకద్ర ఎంపీపీ రమాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, చిన్నచింతకుంట ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, సెప్టెంబర్ 2: మండలకేంద్రంతోపాటు చిన్నరేవల్లి, మాచారం, ఉడిత్యాల, మోతీఘనఫూర్, ఊటకుంటతండా, గౌతాపూర్, వాయిల్‌కుంటతండా, ఈదమ్మగడ్డతండా, చింతకుంటతండా, మొదంపల్లి తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాపండుగను ఘనంగా జరుపుకొన్నారు. మండలకేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఎగురవేశా రు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ కల్యాణి, వైస్‌ఎంపీపీ వెంకటాచారి, యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మ ల్లేశ్, శివానందరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ మంజునాయక్, యాదయ్య, లక్ష్మణ్‌నాయక్, సర్పంచులు గోపీనాయక్, శంకర్, దేవుజ్యానాయక్, లక్ష్మీచంద్రమౌళి, మాలతీయాదిరెడ్డి, లలితామంజునాయక్, నాగిరెడ్డి, రాంచందర్, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, సెప్టెంబర్ 2 : మండలవ్యాప్తంగా గులాబీ జెండాపండుగ వేడుకలను టీఆర్ఎస్ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, ఎంపీపీ సుశీలారమేశ్నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, నరహరి, సత్యయ్య, ఆనంద్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, యాదగిరి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, సెప్టెంబర్ 2 : మండలంలోని గులాబీ జెండా పండుగను సంబురంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, ఎంపీపీ కాంతమ్మ, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగారెడ్డి, బాలు, వెంకట్, బాలయ్య, దానియేలు, బాలస్వామి, బుచ్చయ్య, శేఖర్, ప్రతాప్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, సుకుమార్, భాస్కర్‌నాయక్, నాగరాజుగౌడ్, సురేందర్‌గౌడ్, శ్రీనివాసులు, భీంరాజు, వెంకటయ్య, ఆంజనేయులు, జగన్‌గౌడ్, గోపాల్ పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, సెప్టెంబర్ 2 : మండలంలోని అన్ని గ్రామాల్లో గులాబీ జెండాపండుగను టీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, ఎంపీపీ బాలరాజు, మాజీ అధ్యక్షుడు కొండా లక్ష్మయ్య, సింగిల్‌విండో చైర్మన్ వెంకట య్య, వైస్‌చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమి తి మండల కన్వీనర్ రాజుయాదవ్, జంబుల య్య, కొండా బాలయ్య, నరేందర్, రమణారెడ్డి, శివకుమార్, ఆశన్న, జహంగీర్, ఖాజాగౌడ్, యా దయ్య, చెన్నయ్య, ఆనంద్ పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, సెప్టెంబర్ 2 : మండలంలోని అన్ని గ్రామాల్లో గులాబీ జెండాపండుగను ఘ నంగా నిర్వహించారు. మండలకేంద్రంలో నిర్వహించిన జెండావిష్కరణలో ఎంపీపీ శశికళాభీంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ కృష్ణయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, సెప్టెంబర్ 2 : మండలవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్ఎస్ నా యకులు సంబురంగా ని ర్వహించారు. మండలకేంద్రంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ కమ తం శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, జూలపల్లి సర్పంచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి, నీలేశ్, ఎంపీటీసీ చెన్నయ్య, అంజమ్మ, మల్లేశ్, ఉపసర్పంచ్ అశోక్, అనురాధ, రాంలాల్, గోపా ల్, చంపాబాయి, గోపాల్‌రెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, సుంకిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సాబేర్, రాజశేఖర్‌గౌడ్, బిక్షపతి, గోపాల్, తిర్మల్‌రెడ్డి, సూర్యానాయక్, రాజునాయక్, కృష్ణారెడ్డి, రమేశ్‌రెడ్డి, కేశవులు, సత్యయ్య, హతిక్, శ్రీకాంత్, జోగు కృష్ణ పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, సెప్టెంబర్ 2 : మండలవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించా రు. మండలకేంద్రంతోపాటు వెన్నాచేడ్, పెద్దవార్వల్, చిన్నవార్వల్ తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పీఏసీసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, రాజ్‌కుమార్‌రెడ్డి, రాంచంద్రారె డ్డి, దశర థ్, వెంకట్‌రెడ్డి, రాజిరెడ్డి, కాశీనాథ్‌రెడ్డి, కృష్ణయ్య, మల్లికార్జున్, రమేశ్‌రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, సెప్టెంబర్ 2 : మండలవ్యాప్తంగా గులాబీ జెండా రెపరెపలాడింది. గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు గులాబీ జెండా ఎగురవేసి సం బురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీఎన్ రావు, స ర్పంచులు గోపాల్‌గౌడ్, కృష్ణయ్య, లలితమ్మ, జ యమ్మహన్మంతు, గౌసియాబేగం, సత్యం, సౌజన్యరఘు, లతాశ్రీనివాస్రెడ్డి, నర్సింహానాయక్, ఎంపీటీసీలు రాధాకృష్ణ, లలితాబాయి, నాయకులు ప్రతాప్, లక్ష్మయ్య, చందర్‌నాయక్, రఘు, గోపాల్, శ్రీను, సంజీవరెడ్డి, ఎల్లప్ప, నవనీతరావు, సంజీవరెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.