
మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 2 : మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చాలని గురువారం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సెక్రటరీ అరవింద్సింగ్ను కలిసి ప్రతిపాదనలను నివేదించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పలు అంశాలను వివరించారు. స్వదేశీదర్శన్ స్కీంలో చారిత్రాత్మక కోటల సంరక్షణ, మహబూబ్‌నగర్ జిల్లాలోని పిలిగ్రీమేజ్ అండ్ నేచర్ టూరిజం సర్క్యూట్, ప్రసిద్ద బుద్దిజం కేంద్రాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో సుమారు రూ.25కోట్లతో నిర్మిస్తున్న కల్చరల్ సెంటర్‌కు ఠాగూర్ కల్చరల్ కాంప్లెక్స్ స్కీం ద్వారా రూ.15కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. హెరిటేజ్ స్కీంలో ఎంపికైన గోల్కొండ కోట, అలంపూర్ జోగుళాంబ, రామప్ప ఆలయాల పనులను ప్రారంభించాలని విన్నవించారు. అలాగే రాష్ట్రంలో ఐఐటీటీఎం క్యాంపస్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఈడీ శంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.