
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 1 : హన్వాడ మండలం లో 500 ఎకరాల్లో ఫుడ్‌కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని స మావేశ మందిరంలో కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేసే ప్రాంతంలో రైతులతో చర్చించాలన్నారు. పప్పు, నూనె మిల్లులతోపాటు అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని, అందరూ సహకరిస్తే మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వానికి లేదన్నారు. సమాంతర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. అంతకుముందు జి ల్లా కేంద్రంలోని దూద్ దవాఖానను ప్రత్యేకంగా పరిశీలించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ నందలాల్‌పవార్, ఎం పీపీ బాలరాజు, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మిశివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరును అందంగా తీర్చిదిద్దుతాం
అభివృద్ధికి కంకణబద్ధులై పనిచేస్తున్నామని, పాలమూరు పట్టణాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దుతామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో రూ.2.05 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల, ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.3.20 కోట్లతో 12 గ దులు, రూ.1.34 కోట్లతో నిర్మించిన ఏడు అదనపు తరగతి గదులను, అల్లీపూర్ రూ.5.04 కోట్లతో బీటీ రోడ్డు పనులు, మరో రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాహ్మణ్వాడిలోని మహిళా సమాఖ్య భవనం లో రూ.3.45 కోట్లతో కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్లను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎంవీఎస్ కళాశాల పౌ ల్ట్రీ షెడ్డులో కొనసాగిందని గుర్తు చేశారు. విద్యార్థులకు సకల సౌకర్యాలను కల్పించాలనే సంకల్పంతో రూ.కో ట్లు ఖర్చు చేసి అదనపు తరగతి గదులను నిర్మించినట్లు చెప్పారు. పట్టణంలో రహదారుల అనుసంధానం చేసేలా రింగురోడ్డు నిర్మాణం చేపడుతామని చెప్పారు. రహదారులు, దవాఖాన అభివృద్ధితోపాటు మన్యంకొండలో మినీ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నామని చెప్పారు. నూతనంగా ఇండ్ల నిర్మాణం చేపట్టే వారు అనుమతులు తీసుకుని నిర్మించుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి చెందే జిల్లాగా నిలిచిందని పేర్కొన్నారు. అంతకు ముందు భూత్పూర్ నుంచి చించోలికి వెళ్లే జాతీయ రహదారిని మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, డీఈవో ఉషారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, అర్బన్ తాసిల్దార్ పార్థసారధి, కౌన్సిలర్లు రాణి, రామాంజనేయులు, రాము, నాయకులు శాంతిభూషణ్, యాదగిరి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.