
అలంపూర్, ఫిబ్రవరి 1 : శక్తికి ప్రతిరూపం.. జో గుళాంబ అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠాల్లో అలంపూర్లో ఉన్న జోగుళాంబ ఆలయానికి ఐదో శక్తి పీ ఠంగా పేరుంది. క్షేత్రంలో జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలతోపాటు నవబ్రహ్మ ఆలయా లు కూడా ఉన్నాయి. కోటి లింగాలకు కొలువైన క్షే త్రంలో సకల దేవతలకూ ఆలయాలు ఉన్నాయి. బ్ర హ్మ దేవుడి విగ్రహం కూడా ఉన్నది. రేణుకాదేవి సం తానలక్ష్మిగా దర్శనమిస్తుంది. కంచి కామాక్షి ఆ లయం ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఎక్కడా లేని వి ధంగా ఇక్కడ రసలింగం ఉన్నది. పూర్వం ఈ లింగం నుంచి రసాలు వెలువడుతున్నందున రసలింగం అని పిలిచేవారట. బ్రహ్మ తపస్సు చేయడంతో పరమేశ్వరుడు ఉద్భవించినందున బ్రహ్మేశ్వరుడని, లింగం చిన్నగా ఉండడంతో బాలబ్రహ్మేశ్వరుడని రకరకాల పేర్లు వాడుకలో ఉన్నాయి. గోమాత భూమిపై పాదం మోపినప్పుడు పడిన గెట్టె మాదిరి లింగం పై భాగం చీలిపోయినట్లు ఉంటుంది. ఇంతటి విశిష్టమైన చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ప్రతి ఏటా ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఈవో పురేందర్ కుమార్, సిబ్బంది, అర్చకులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. బుధవారం నుంచి 6వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి.