
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధుల పుట్టిన రోజు వేడుకలంటేనే హంగామా ఉంటుంది. అభిమానులు, కార్యకర్తలు, బంధుమిత్రు లు గిఫ్టులు, బొకేలు, శాలువాలు తీసుకొస్తుంటారు. వీటి కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ, ఎ వరికీ ఉపయోగం ఉండదు. దేవరక ద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులకు ఓ సూచన చేశారు. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వ చ్చే వారు బొకేలు, శాలువా లు తీసుకురావొద్దని, ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలని కోరారు. ది వ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు సమకూర్చాలన్నారు. గిఫ్ట్ ఏ ప్లాంట్ కింద మొక్కలు ఇస్తే వాటన్నింటినీ నాటించే బాధ్యత తీసుకుంటాన ని తెలిపారు. భూత్పూర్ మండలం అ న్నాసాగర్లోని ఎమ్మెల్యే స్వగృహం లో ఉదయం నుంచి పలు కార్యక్రమా లు చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు.
మెగా హెల్త్ క్యాంప్..
ఎమ్మెల్యే ఆల పుట్టిన రోజు సంద ర్భంగా ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్న విధంగానే ఈసారి కూడా అన్నాసాగర్ లో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తు న్నట్లు మలక్‌పేట యశోద దవాఖాన కు చెందిన వైద్యుడు డా. సురేందర్‌రె డ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే హెల్త్ క్యాంప్‌లో కా ర్డియాలజీ, జనరల్ ఫిజీషియన్, ఆం కాలజీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ, న్యూరో ఫిజీషియన్, ఆర్థ్ధోపెడిక్స్, పీ డియాట్రీ తదితర విభాగాలకు చెందిన ఉచిత వైద్య సేవలందిచనున్నారు. అ త్యాధునిక వైద్య సేవలతోపాటు ఉచి తంగా మందులు అందిస్తామని సురేం దర్‌రెడ్డి తెలిపారు. అలాగే రెడ్‌క్రాస్, మహబూబ్‌నగర్ జనరల్ దవాఖాన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పా టు చేయనున్నారు. రక్తదానం చేసేం దుకు కార్యకర్తలు, అభిమానులు హా జరుకావాలని పార్టీ నేతలు కోరారు.
జిల్లా కేంద్రంలోని యుక్త మోటర్స్ రెనాల్ట్ కారు షోరూంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఫీచర్స్‌తో కూడిన కైగర్ ఆర్ఎక్స్టీ, క్విడ్ కార్లను బుధవారం వీవీసీ గ్రూప్ చైర్మన్ వీవీ రాజేంద్రప్రసాద్, ట్రేడ్ గ్రూప్ ఎండీ గోపాల్‌రెడ్డి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సరికొత్త హంగులతో నూతన ఫీచర్స్‌తో యువతను ఆకట్టుకుంటాయన్నారు. కార్యక్రమంలో షోరూం మేనేజర్ రమేశ్, సర్వీస్ మేనేజర్ యాదగిరి, కస్టమర్లు ఉన్నారు.