
పాఠశాలలు సిద్ధం
శుభ్రమవుతున్న బడులు
ఒకటి నుంచి బడిబాట
మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 29 : కరోనా కారణంగా 16 నెలలుగా మూతపాడిన పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. ప్రత్యక్ష విద్యాబోధన లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా తగ్గుము ఖం పట్టడంతో తిరిగి పాఠశాలలు పునఃప్రారంభించి ప్రత్యేక్ష విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష యం విదితమే. మేధావుల అభిప్రాయం, ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల నుంచి నివేదికలు తెప్పించుకున్న తర్వాత ప్రభు త్వం సెప్టెంబర్ నుంచి అన్ని పాఠశాలలు ప్రారంభించి పూ ర్తిస్థాయి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బడులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 30వ తే దీలోగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేం ద్రాలు, కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలను శుభ్రం చేయనున్నారు. అందుకుగానూ జిల్లా అధికారులు, మండల ప్రత్యే క అధికారులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ నడుం బిగించారు.
పాఠశాలల్లో శుభ్రత కార్యక్రమం
జిల్లాలోని దాదాపు 1,200 పాఠశాలల్లో వారివారి పరిధిలో పాఠశాలలను సందర్శించి శుభ్రం చేయించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల గదులను పిచికారీ చేయడంతోపాటు ఆవరణల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. మిషన్ భగీరథ ద్యారా పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల నల్లా కలెక్షన్ ఇస్తున్నారు.
ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కరోనా సోకకుం డా పూర్తిగా కొవిడ్ నిబంధనలు పాటించే లా ప్రతి విద్యార్థి మాస్కు ధరించడం, శానిటైజర్ వాడడం, భౌతిక దూరం పాటించే లా అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పిస్తా రు. అవసమైన చోట పాఠశాలలకు రంగు లు వేయడం, పాఠశాల పర్యవేక్షణ చేసేందుకుగానూ జిల్లా అధికార యంత్రా గం ప్రణాళిక సిద్ధం చేసింది. అవసరమైతే దా తల సహకారం తీసుకోనున్నారు. ఇప్పటికీ దాదాపు పాఠశాలలను శుభ్రం చేసి సిద్ధం గా ఉంచారు. పాఠశాలలో చేపడుతు న్న ప నులను కలెక్టర్ వెంకట్రావు తనిఖీ చేశారు. పోలీస్లైన్, మాడల్ బేసిక్ స్కూల్, పాత పాలమూరు తదిత ర పాఠశాలలను అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ పరిశీలించారు.
పాఠశాలలు సిద్ధం చేస్తాం…
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఈ నెల 30వ తేదీ లోగా అన్ని పాఠశాలలు శుభ్రం చేస్తాం. ఇప్పటికీ అన్ని శాఖల అధికారుల సహకారంతో పనులు ప్రారంభిం చాం. అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించేందు కృషి చేస్తాం. హెచ్ఎంలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులకు తగి న సూచనలు ఇచ్చాం. జిల్లాలో ప్రతి పాఠశాలను ప్రభు త్వ ఆదేశాలకు అనుగుణంగా సిద్ధం చేస్తాం. ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.
-ఉషారాణి డీఈవో, మహబూబ్నగర్ జిల్లా