
‘పాలమూరు’పై బీజేపీ వైఖరి ఏమిటో తెలపాలి
అవాకులు, చెవాకులు పేలితే ప్రజలు పాతాళానికి తొక్కేస్తారు
అక్రమ ప్రాజెక్టులకు హారతులు పట్టిన చరిత్ర మీది..
ప్రెస్మీట్లో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం సాధించిందని.. ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసమే ప్రతిపక్షాల నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వారే మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు.. పాలమూరు ప్రాజెక్టుపై బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలని మంత్రి నిలదీశారు. అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులకు హారతులు పట్టిన చరిత్ర మీదని గుర్తు చేశారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసమే ప్రతిపక్షాల నాయకులు అవాకులు.. చెవాకులు పేలుతున్నారని ఎ క్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు.. ప్రభుత్వంపై అనవసరమైన ఆ రోపణలు చేస్తే వారిని ప్రజలే పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు.. కేంద్రంలో అ ధికారంలో ఉన్న బీజేపీ ఏం సాధించిందని.. ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి ప్రసంగించారు. అధికారంలోకి రాకముందు బీజేపీ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల స మావేశంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్నారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడేండ్లు దాటినా ఊసెత్తడం లేదని విమర్శించా రు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న పాలమూరును కాదని అక్రమంగా పెన్నా బేసిన్‌కు నీటిని తరలించడం సక్రమమా..? 300 కి.మీ. పరీవాహక ప్రాంతం ఉన్న ఉమ్మడి జిల్లాకు కృష్ణా నుంచి సాగునీరు ఇవ్వడం అక్రమమా..? అని మంత్రి నిలదీశారు. కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడుకు మళ్లిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్య రాష్ట్రంలో అక్రమ ప్రాజెక్టు అయిన హంద్రీనీవాకు హారతులు పట్టిన నేతలు ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రంతో మాట్లాడి జాతీయ హోదా, నిధులు ఎందుకు తీసుకురావడం లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో పదవులు అనుభవించి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జాతీయ ప్రాజెక్టు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు ఈ అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని ప్రశ్నించారు.
ప్రైవేటు పరం చేస్తున్నామని చెప్పేందుకే పాదయాత్రలా?
బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు.. ఎల్ఐసీ, రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నామని చెప్పేందుకు పాదయాత్ర చేస్తున్నా డా..? అని మంత్రి ప్రశ్నించారు. సికింద్రాబాద్- గుంతకల్ రైల్వే లైన్ కూడా ప్రైవేటీకరణలో ఉందన్నారు. 70 ఏండ్లలో జరిగిన అభివృద్ధి ఎంత.. ఏడేండ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో పాదయాత్రలో ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఒక టే పార్టీలో రెండు పాదయాత్రలు చేస్తూ తమ ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నార ని, వారికి రాష్ట్ర సంక్షేమంపై పట్టింపు లేదన్నారు. కులం, మతం పేరిట ప్రజలను విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న భాష చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పారు. ప్రతిపక్షాల నేతల మాట తీరును బట్టే తమ పార్టీ నేతలు సమాధానం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇంకా రెండేండ్ల తర్వాత వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రభుత్వంపై వి షం చిమ్ముతున్నారని, ఇది వారి విజ్ఞతకు వదిలేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తాము పిలుపునిస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేవన్నారు. మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణరాణే అక్కడి సీఎంపై తప్పుగా మాట్లాడినందుకు అరెస్టు చేసి జైల్లో వేసిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పుడు మాటలు మాట్లాడే వారిని అరెస్టు చేయడం తమకు చేత గాక కాదని.. కానీ చిల్లర, మల్లర వ్యక్తులను తాము పట్టించుకోబోమన్నారు. తమ ఓపికకు హద్దులున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు బాగుందని డజన్ మంది కేంద్ర మంత్రులు కితాబునిచ్చిన విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు మర్చిపోయినట్టున్నారని అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.