
వ్యాధుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి : డీఎంహెచ్‌వో కృష్ణ
జడ్చర్లటౌన్, ఆగస్టు 21 : వారంరోజులపాటు చేపట్టిన దోమలపై సమరం కార్యక్రమాన్ని విజయవంతం చేసి సీజనల్ వ్యాధు ల వ్యాప్తిని నివారిద్దామని డీఎంహెచ్‌వో కృష్ణ అన్నారు. జడ్చర్ల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జిల్లాలో డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారుల భాగస్వామ్యంతో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30వ తేదీవరకు నిర్వహించనున్న దోమలపై సమరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచ ర్లు, వైద్య, మున్సిపల్ సిబ్బంది ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంటింటికి వెళ్లి సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాతటైర్లు, కుండల్లో నీటినిల్వ లేకుండా చూడాలన్నా రు. మురుగుకాల్వల్లో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించడంతోపాటు అన్ని ప్రాంతాల్లో ఫా గింగ్ చేయాలన్నారు. అలాగే నీటినిల్వ ప్రదేశాల్లో ఆయిల్‌బాల్స్ వేయించాలని సూచించారు. అంతకుముందు జిల్లా మలేరియా నివారణాధికారి విజయ్‌కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్స న్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ సారిక, కమిషనర్ సునీత, అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
భూత్పూర్, ఆగస్టు 21 : సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో కృష్ణ కోరారు. స్థానిక పీహెచ్సీలో మున్సిపల్ చైర్మన్ సత్తూ ర్ బస్వరాజ్‌గౌడ్ అధ్యక్షతన మున్సిపల్, వైద్య సిబ్బందికి సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన క ల్పించారు. ప్రధానంగా ఇండ్ల మధ్య నీటినిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కా ర్యక్రమంలో డీఎంవో విజయకుమార్, ప్రో గ్రాం ఆఫీసర్ సంధ్యాకిరణ్మయి, డాక్టర్ స త్యనారాయణ, సీహెచ్‌వో రామయ్య, సూ పర్వైజర్ యాదమ్మ ఉన్నారు.
దోమల వృద్ధిని అరికట్టాలి
గండీడ్, ఆగస్టు 21 : గ్రామాల్లో దోమల వృద్ధిని అరికట్టాలని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలో ఉమ్మడి మండలంలోని ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధు ల నివారణకు ప్రతిఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అ లాగే గ్రామాల్లోని మురుగునీటి గుంతల్లో ఆయిల్‌బాల్స్ వేయడంతోపాటు ఫాగింగ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, ఎంపీ వో శంకర్‌నాయక్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మదిలేటి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
హన్వాడ, ఆగస్టు 21 : దోమకాటుతో వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన క ల్పించాలని ఎంపీపీ బాలరాజు అన్నారు. శ నివారం మండలకేంద్రంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీజనల్ వ్యా ధులను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన దోమలపై సమరం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రధానంగా గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మురుగునీటి గుంతల్లో ఆయిల్‌బాల్స్ వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్‌రెడ్డి, మిషన్ భగీరథ ఏఈ యాదయ్య పాల్గొన్నారు.
దోమలపై యుద్ధం చేయాలి
రాజాపూర్, ఆగస్టు 21 : ఆరోగ్య సంరక్షణకోసం ప్రతిఒక్కరూ దోమలపై యుద్ధం చేయాలని ఎంపీపీ సుశీల అన్నారు. శనివారం మండలకేంద్రంలో సీజనల్ వ్యాధు లు, నులిపురుగుల నివారణపై సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశు ధ్యం లోపించకుండా పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన దోమలపై సమరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, డాక్టర్ ప్రతాప్చౌహాన్, ఎంపీవో వెంకట్రాములు, ఏపీఎం వెంకటాచారి ఉన్నారు.
భాగస్వాములు కావాలి
బాలానగర్, ఆగస్టు 21 : దోమలపై స మరం కార్యక్రమంలో మండల ప్రజలు భా గస్వాములు కావాలని ఎంపీవో శ్రీదేవి అ న్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. దోమకాటుతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో తాసిల్దార్ రవీంద్రనాథ్, ఏపీవో రాజశేఖర్, వైద్యసిబ్బంది ఉన్నారు.
సమూలంగా నిర్మూలించాలి
నవాబ్‌పేట, ఆగస్టు 21 : మండలంలో ని గ్రామాల్లో దోమలను సమూలంగా ని ర్మూలించాలని మండల వైద్యాధికారి నవీన్‌కుమార్‌రెడ్డి కోరారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మహిళా సమాఖ్య సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో భద్రునాయక్, ఏఈ శమీయుల్లాఖాన్ పాల్గొన్నారు.