
గ్రామ కమిటీ ఏర్పాటులో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
మహ్మదాబాద్, సెప్టెంబర్ 9 : రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నా రు. గురువారం మండలంలోని గాధిర్యాల్ గ్రామ కమిటీని ఎమ్మెల్యే సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా హన్మంతుగౌడ్, ఉపాధ్యక్షుడిగా గుండాల కృష్ణ య్య, కార్యదర్శిగా కోట్ల రాములు తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. నూతన కమిటీల సభ్యులు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ను మ రింత బలోపేతం చేయడంతోపాటు సంక్షే మ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీ నివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీ నివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, స ర్పంచ్ వెంకట్రాంరెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, బాలవర్ధన్‌రెడ్డి, సం దోళ్ల హన్మయ్య, రాములు, పెంట్యానాయ క్, ఖాదర్, అంజి. కృష్ణయ్య పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ ఫలాలు అందాలి
భూత్పూర్, సెప్టెంబర్ 9 : టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడంతోపాటు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అం దేలా చూడాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలోని 5, 6 వార్డుల్లో టీఆర్ఎస్ కమిటీలను ఏర్పా టు చేశారు. 5వ వార్డు అధ్యక్షుడిగా ఆగిరి వెంకటేశ్, యూత్ అధ్యక్షుడిగా వెంకటేశ్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా యశోద, బీసీసెల్ అధ్యక్షుడిగా ముత్యాల రాములును నియమించినట్లు తెలిపారు. 8వ వార్డు అధ్యక్షుడిగా మౌలాలి, యూత్ అధ్యక్షుడిగా మస్తాన్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా లలితమ్మ, మైనార్టీసెల్ అధ్యక్షుడి ఖదీర్‌ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జీలు పొన్నకల్ మహమూద్, తిరుపతిరెడ్డి, కౌన్సిలర్ కృష్ణవేణి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, సాయిలు సత్యనారాయణ, అశోక్ పాల్గొన్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బాలానగర్, సెప్టెంబర్ 9 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ణం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని మోతీఘనపూర్, మాచారం, ఈదమ్మగడ్డ, మేడిగడ్డతండాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. మోతీఘనపూర్ గ్రామ అధ్యక్షుడిగా నర్సింహయాదవ్, ఉపాధ్యక్షుడిగా ఖాజాపాషా, యూత్ అధ్యక్షుడిగా రవి, ఉపాధ్యక్షుడిగా షఫీతోపాటు అనుబంధ కమిటీలను ఎన్నుకున్న ట్లు తెలిపారు. అలాగే మోతీఘనపూర్ కాం గ్రెస్ నాయకులు రాజు, నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమాల్లో వైస్‌ఎంపీపీ వెంకటాచారి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుండేడ్ చెన్నారెడ్డి, యూ త్ వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, సింగిల్‌విండో డైరెక్టర్ నాగిరెడ్డి, సర్పంచులు దేవుజ్యానాయక్, రమేశ్, మాలతీయాదిరెడ్డి, నాయకులు దేశ్ముక్ ప్రతాప్‌రెడ్డి, యాదిరెడ్డి, ప్రకాశ్‌యాదవ్, నవాజ్ పాల్గొన్నారు.
పార్టీకోసం పనిచేసే వారికే గుర్తింపు
హన్వాడ, సెప్టెంబర్ 9 : పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసేవారికే గుర్తింపు ఉం టుందని ఎంపీపీ బాలరాజు అన్నారు. మం డలంలోని బుద్ధారం, హన్వాడ, పెద్దదర్ప ల్లి, యారోనిపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రా మ కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు సుధ, చెన్నయ్య, వెం కన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, వైస్‌చైర్మన్ కృష్ణయ్యగౌడ్, కొండా లక్ష్మయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రా జుయాదవ్, అన్వర్, జంబులయ్య, కొండా బాలయ్య, రమణారెడ్డి, శ్రీనివాసులు, సత్యం, సుధాకర్‌రెడ్డి, నరేందర్, కృష్ణయ్యగౌడ్, యాదయ్య, బసిరెడ్డి పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, సెప్టెంబర్ 9 : మండలంలోని పెద్దవార్వల్, వెన్నాచేడ్, జిన్నారం గ్రా మాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దవార్వల్ గ్రామ అధ్యక్షుడిగా కృష్ణయ్య, కార్యదర్శిగా బాబు, వెన్నాచేడ్ గ్రామాధ్యక్షుడిగా పిట్ల మాణిక్యం, ఉపాధ్యక్షుడిగా దశరథ్, కార్యదర్శిగా బాల్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో మాజీ సర్పంచ్ ఉప్పరి గోపాల్, చిన్న య్య, రాంరెడ్డి, మల్లికార్జున్, లక్ష్మయ్య, దశరథ్, మాణిక్యం బొక్క రాములు, రాజిరెడ్డి, కాశీనాథ్‌రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, సెప్టెంబర్ 9 : మండలంలో ని గురుకుంట, జంగమయ్యపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అ నంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, యూత్ అధ్యక్షు డు మెండె శ్రీను, సర్పంచులు లక్ష్మమ్మ, వెం కటేశ్, నాయకులు ప్రతాప్, గాండ్ల రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్, పురుషోత్తం పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, సెప్టెంబర్ 9 : మండలంలోని సంకలద్ది, నందిపేట, దాసరిపల్లి గ్రా మాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పా టు చేశారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, వైస్‌ఎంపీపీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెం కటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మం డల కోఆర్డినేటర్ రఘుపతిరెడ్డి, గూపని కొండ య్య, శివరాములు, మల్లయ్య, శేఖర్, శ్రీనివాసులు, చంద్రశేఖర్, స్వరూప ఉన్నారు.
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 9 : కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుగొమ్మలని గ్రా మ కమిటీల ఇన్చార్జి, అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కౌ కుంట్ల, ఇస్రంపల్లి, వెంకటగిరి గ్రామాల్లో టీ ఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశా రు. కౌకుంట్ల గ్రామ అధ్యక్షుడిగా శివకుమా ర్, యూత్ అధ్యక్షుడిగా శేఖర్‌రెడ్డి, ఇస్రంపల్లి గ్రామ అధ్యక్షుడిగా గొల్ల ఈశ్వర్, యూ త్ అధ్యక్షుడిగా విజయ్, మైనార్టీసెల్ అధ్యక్షుడిగా నహీద్, వెంకటగిరి గ్రామ అధ్యక్షుడిగా నారాయణరెడ్డి, యూత్ అధ్యక్షుడిగా శాంతయ్యలను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజేశ్వరి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శివరా జు, సర్పంచులు వైదేహి, స్వామి, సింగిల్‌విండో చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ కిష్ట న్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి న ర్సింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్, శేఖర్‌రెడ్డి, విజయ్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.