
మక్తల్ టౌన్, అక్టోబర్ 9 : అమ్మవారి శరన్నవ రాత్రి ఉ త్సవాలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు కా త్యాయినీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి గణపతి పూజ, అభిషేకం, కలశ పూజ, సామూహిక కుంకుమార్చన పూజ, వాహన సేవ, మహా మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. అదేవిధంగా మ హిళలు బతుకమ్మ పండుగ సందర్భంగా అటుకుల బతుక మ్మను నిర్వహించారు. పట్టణంలోని నల్లజానమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
శరన్నవ రాత్రి పూజలు
ధన్వాడ, అక్టోబర్ 9 : శరన్నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా మండలంలోని అంబాభవాని, గంగామాత ఆలయాల వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా రజక సంఘం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాతకు రజక సంఘం జిల్లా కార్యదర్శి పటేల్ నర్సింహులు దంపతులు పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమం లో అర్చకులు, రజక సంఘం నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అన్నపూర్ణాదేవిగా అమ్మవారు…
నారాయణపేట రూరల్, అక్టోబర్ 9 : మండలంలోని సింగారం భవానిమాత అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చా రు. అలాగే కోటకొండ కన్యాకపరమేశ్వరి అమ్మవా రు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శినమిచ్చారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి సకాలంలో వర్షాలు కురిసి పంట దిగుబడు లు అధికంగా వచ్చి ప్రజలందరిపై ఆశీర్వాదాలు ఉండాలని ప్రార్థించారు.
గాయత్రీదేవిగా వాసవీమాత
నారాయణపేట టౌన్, అక్టోబర్ 9 : పట్టణంలోని పలు ఆయాలల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్ర త్యేక పూజలు చేశారు. నగరేశ్వర ఆలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా, శక్తిపీఠంలో మహాలక్ష్మీ అమ్మవారిని అన్నపూర్ణామాతగా అలంకరించారు. అశోక్‌నగర్‌లోని మ ల్లాంబికామాత ఆలయంలో అమ్మవారు మధుర మీనాక్షి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పత్తి బజార్‌లోని మరిగమ్మ ఆలయంలో అమ్మవారు కొల్లాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. సరాఫ్ బజార్, మడిఈశ్వర్ మందిర్‌లో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.