
జడ్చర్ల టౌన్, అక్టోబర్ 9 : ఆధునిక సమాజంలో మానవుడి జీవనశైలి ఓ యంత్రంలా మారింది. ఈ తరుణంలో వివిధ రకాల మానసిక ఒత్తిళ్లతో ఆవేశం, అతిభయం, దు ష్ప్రవర్తన, దౌర్జన్యం వంటి లక్షణాలకు దారి తీస్తున్నది. ప్ర తిఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యత్నిస్తే సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు లేని నవసమాజం ని ర్మాణమవుతున్నది. కాగా, ప్రతి తాళానికి తాళం చెవి ఉన్న ట్లే ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం ఉంటుందని సైకాలజిస్ట్, ఎన్సీఈఆర్టీ ఎడ్యుకేషన్ కౌన్సెలర్ పూదత్తు కృష్ణమోహన్ సూచించారు. ఆదివారం ప్రపంచ మానసిక ఆరో గ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణమోహన్ శనివా రం పలు అంశాలను ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.
మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు
తల్లిదండ్రులు, విద్య, ఉపాధ్యాయులు, స్నేహితులు, పా ఠశాల, కళాశాల, సమాజం, ప్రసార మాధ్యమాలు, మన స్సు, పౌష్టికాహారం, సినిమాలు, సోషల్ మీడియా, పరిసరాల ప్రభావం, ఆర్థిక పరిస్థితి, పెంపకం, అభ్యాసన లోపా లు, దురలవాట్లు, కుటుంబ సమస్యలు, శారీరక అనారో గ్యం, మార్గదర్శులు, ఒత్తిడి, భయం, దైవం, మతం, యో గా, ధ్యానం తదితర అంశాలు.
దుష్ఫలితాలు
హత్యలు, ఆత్మహత్యలు, యాసిడ్ దాడులు, మానభంగాలు, అధిక రక్తపోటు, గొడవలు, విడాకులు, ఈర్ష్యా ద్వేషాలు, డ్రగ్స్, మద్యపానం, సిగరె ట్ లాంటి వ్యసనాలకు బానిస కావ డం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, నిరాశానిస్పృహలు, డిప్రెషన్‌కు లోనుకావ డం, అసహనం, అభద్రతాభావం, ఓ టమిని తట్టుకోలేకపోవడం, ఆత్మహ త్య ఆలోచనలు వస్తాయి.
మానసిక ఆరోగ్య లక్షణాలు
వ్యక్తి తన శక్తి సామర్థ్యాలు, బలహీనతలను తెలుసుకుని ఉంటాడు. సర్దుబాటుగుణం, ఉద్వేగాలలో పరిణతి, అందరితో కలిసిపోవడం, మంచి ఆలోచనలు చేయడం, మంచి నిర్ణయాలు తీసుకోగలగడం, విచక్షణతో ప్రవర్తించడం, వాస్తవికతను గుర్తించడం, అపజయాన్ని స్వీకరించడం, ఒత్తిడిని గుర్తించి తట్టుకోవడం, ఆత్మైస్థెర్యం కలిగి ఉండడం, ఏకాగ్రతను కలిగి ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం, ప్రవర్తన అలవాట్లను కలిగి ఉండటం, శాంతస్వభావం, కోపతాపాలకు, ఈర్ష్యాద్వేషాలకు దూరంగా ఉండటం, అందరిచేత అమోదించబడటం వంటి లక్షణాలు ఉండటం
.
పాటించాల్సిన నియమాలు