
ఆత్మకూరు, అక్టోబర్ 9 : కరోనా కష్టాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటుపడుతున్నా రు. మార్కెట్లు, సినిమా టాకీస్లు, స్కూళ్లు, కాలేజీలు అన్నీ తెరుచుకోకున్నాయి. ఈ క్రమంలో అభిరుచులు, సరదాలు తీర్చుకుంటూ వాటి మాటున పందేలు కాస్తూ తమకు తెలియకుండానే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ప్రతి వేసవిలో ఐపీఎల్ మ్యాచ్‌లతో కనబడే హోరు ఈ ఏడాది కరోనాతో ఆలస్యంగా ప్రారంభమైంది. లీగ్ మ్యాచ్‌ల దశలోనే ఆటగాలకు కరోనా సోకడంతో వా యిదాపడిన మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమవ్వడంతో క్రీడాభిమానులు పుల్ జోష్‌లో ఉన్నారు. అదేవిధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలు రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తుండడంతో రాజకీయ పార్టీ నాయకులు, సామాన్యులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఓవైపు ఉత్కంఠభరితంగా సాగుతున్న క్రికెట్ మ్యాచులు, మరోవైపు ఉప ఎన్నిక సమరం దగ్గరపడుతున్నది. ఎదుటివాడు ఏమైతే మాకేంటి అనుకునే కోణంలో ఆలోచించే సమాజంలో ప్రతి విషయానికీ పందెం కాస్తూ టైంపాస్ మాటున కమర్షియల్ కుంపట్లో ఓ పక్క ఆనందం.. మరో పక్క ఆవిరైపోతున్నారు. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్), బీపీఎల్ (బై పోలింగ్ లీగ్) సమరం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఉత్కంఠ రేపుతున్న రాజకీయ సమరం..
ఈనెల 1న హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా.. అదే రోజు నుంచి నామినేషన్ల పర్వం ఆరంభమైంది. ఒక్కో పార్టీ లెక్కలు ఒక్కో తీరున ఉండగా ఎన్నికల సమరంలో ప్రధానఘట్టానికి తెరలేపి ప్రచారపర్వం లో దూసుకుపోతున్నారు. రాజకీయ ఉద్దండులు జెం డాలు మార్చడం, కండువాలు కప్పుకోవడం, కిలోమీటర్ల పొడవునా పాదయాత్రలు, ఎవ్వరికి మద్దతు పలుకుతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉండ గా హుజూరాబాద్ ఎన్నికల పోరు రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తున్నది. ఈ క్రమంలో నగరాలతోపాటు పట్టణాలు, మం డల కేంద్రాల్లో సైతం బెట్టింగుల పర్వం జోరుగా సాగుతున్నది. ఏ పార్టీ విజయం సాధిస్తుంది..? ఎవరి పాచికలు పండుతాయి..? నాలుగు పర్యాయాల జైత్రయాత్రకు బేకులు పడుతాయా..? కొత్త సారథి కళ నెరవేరుతుం దా..? రాజకీయ రణరంగంలో గెలిచేదెవరు.. ఓడేదెవరు..? అంటూ బెట్టింగులకు పాల్పడుతున్నారు. ప్రచారాలు, పార్టీల వ్యూహాలతో ఆసక్తిని రేపుతూ వైట్ కాలర్ నాయకులు బెట్టింగులకు ఉసిగొల్పుతున్నారు. దీంతో బీపీఎల్ ఉచ్చులో పడి క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు రాజకీయ నేపథ్యం కలిగిన వారు, ఎలాంటి అనుబంధం లేని వారు మోసపోతున్నారు.
క్రికెట్ సమరంలో కుదేలు..
ఐపీఎల్-14 రెండో దశ ముగిసేందుకు దగ్గరపడుతున్నది. ఎంతో ప్రజాదరణ కలిగిన ఈ పోటీలను వీక్షించేందుకు క్రీడాభిమానులు నిరీక్షిస్తారు. బంతికి.. బ్యాట్‌కు మ ధ్య రసవత్తర పోటీలు క్రీడాభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ సమయంలో సులభంగా డబ్బు సంపాదించొచ్చనే అత్యాశతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. కే వలం నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ విష సం స్కృతి ఐపీఎల్, ప్రో కబడ్డీల పుణ్యంతో పల్లెలకు పాకింది. దీంతో విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు, ఆటో డ్రైవర్ల నుంచి వ్యాపారుల వరకు అందరూ బెట్టింగులకు పాల్పడుతున్నారు. కొంతమంది సరదా కోసం బెట్టింగ్ కడుతుంటే.. మరి కొందరు సులభంగా డబ్బులు సంపాదించేయాలనే భావనతో పందెం కడుతున్నారు. జట్టులోని క్రీడాకారులు, గత మ్యాచ్‌లో జట్టు ప్రదర్శన ఆధారంగా పెద్ద జట్టు, చిన్న జట్టుగా విభజించి బెట్టింగ్ పెడుతున్నా రు. పెద్ద జట్టుపై చిన్న జట్టు గెలిస్తే 150 శాతం గెలిచిన వారికి చెల్లిస్తారు. కాగా వీటి లావాదేవీలు అధికంగా ఈ-వ్యాలెట్స్ అయిన ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా జరుగుతున్నాయి. మరో 10-15 శాతం నేరుగా చేతులు మారుతున్నాయి. ప్రతిరోజూ ఆట ప్రా రంభంలోనే మ్యాచ్ టు మ్యాచ్ పందెం కాస్తున్నారు. రెండు జట్ల మధ్య జరుగుతున్న పోటీలో ఏ జట్టు గెలుస్తుందనే దానిపై రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు పందెం కాస్తున్నారు. దీంతో పాటు ఏ బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు తీస్తాడు. ఏ బౌలర్ ఎన్ని వికెట్లు పడగొడతాడు. అనే దానిపై కూడా పందేలు కాస్తున్నారు. బెట్టింగ్‌లో గెలిస్తే రెట్టింపు డబ్బులు వస్తాయనే ఆశతో యువకులు దీనిపై ఆసక్తి చూపుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నా రు. ఇందులో ఎక్కువగా యువతే ఉండ డం గమనార్హం. పోలీసు యంత్రాం గం, నిఘా వ్యవస్థలు ఇప్పుడు పటి ష్టంగా ఉన్నాయి. అధికారులు సమర్థవంతంగా పనిచేస్తే చాలు పందెం రాయుళ్ల పనిపట్టొచ్చు.