
బిజినేపల్లి, అక్టోబరు 9: భవిష్యత్ అంతా వ్యవసా య రంగానిదేనని, దేశంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పాలెం గ్రామంలోని వ్యవసాయ కళాశాలలో రూ.7కోట్లతో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం ప్రస్తుతం ఆహార క్షీణత నుంచి బయట పడిందన్నారు. కేవలం వరి, గో ధుమలే కాకుండా పప్పుధాన్యాలు, ఆయిల్ విత్తనాలు, కూరగాయలు, పండ్లు వంటి ఆహార పదార్థాలు పండిం చే విధంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకో వ్యవసాయ కళాశాల ఉండాల్సిందేనని ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు మాత్రమే ఉన్నాయన్నారు. దేశంలో అత్యధిక ఉపాధిని, ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగం వ్యవసాయ రంగం మాత్రమే అన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా వ్యవసాయం చేస్తూ ఎంతో ప్రావీణ్యం సాధిస్తున్నారన్నారు. మంత్రికి గౌరవ డాక్టరేట్ అందజేసి సత్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపకులపతిని కోరారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి మహర్దశ వచ్చిందన్నారు. ఇందులో మంత్రి ప్రధాన పాత్ర ఉందని కొనియాడారు. వ్యవసాయ కళాశాల ఉపకులపతి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ 2015లో 60 మందితో ఒక సెక్షన్‌గా మారి ప్రారంభించిన కళాశాల 120మందితో నడిపించేందుకు మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నా రు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 120మంది చొప్పు న ప్రవేశాలు ఉంటాయని, పోస్ట్‌గ్రాడ్యుయేట్ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. కార్యక్రమంలో జెడ్పీచైర్‌పర్సన్ పద్మావతి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, రిజిస్ట్రార్ సుధీర్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, సీమా, సత్యనారాయణ, ఏడీఆర్ దామోదరరాజు, డీసీసీబీ డైరెక్టర్ జక్కారఘునందన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, సర్పంచులు లావణ్యనాగరాజు, మాధవిరెడ్డి పాల్గొన్నారు.
బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట
తిమ్మాజిపేట, అక్టోబర్ 9 : వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ.. రైతులను భుజానికి ఎత్తుకున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని పీఏసీసీఎస్‌లో షాపింగ్ కాంప్లెక్స్, సూపర్‌మార్కెట్, గోదాం, నూతన కార్యాలయాలకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ రాములు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్‌తో కలిసి ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సహకారం సంఘం అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు రైతు కష్టాలు తెలుసని అందుకే రాష్ట్ర బడ్జెట్లో రూ.60 వేల కోట్లు కేటాయించారన్నారు. దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ 2కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండిస్తే, తెలంగాణలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండిందన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థితికి చేరుకున్నామన్నారు. నేడు ఆగ్రో కేంద్రాల ద్వారా చదువుకున్న వారు ఉపాధి పొందుతున్నారన్నారు. జనాభాలో ఒకటిన్నర శాతమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయని, మిగిలిన వారికి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. దీనిపై ప్రతిపక్షాలను అవగాహన లేదన్నారు. ఉద్యోగాల పేరిట సన్నాసులు,ఆంధ్రా నాయకుల తొత్తులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. మండలానికి 5వేల మెట్రిక్ టన్నుల గోదాం మంజూ రు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఉదయ్‌కుమార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, రఘునాథ్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంతురావు ఉన్నారు.
సహకార సంఘాలతోనే రైతులు అభివృద్ధి..
తెలకపల్లి, అక్టోబరు 9: సహకార సంఘాల ద్వారానే రైతులు అభివృద్ధి చెందుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చిన్నముద్దునూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థ లంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం, దుకాణాల సముదాయాల నిర్మాణాలకు మంత్రి నిరంజన్‌రెడ్డి శం కుస్థాపన చేశారు. అనంతరం సింగిల్‌విండో చైర్మన్ భా స్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడా రు. కార్యక్రమంలో టీఎస్సీఏబీ చైర్మన్ రవీందర్రావు, ఎంపీపీ మధు, సర్పంచ్ దామోదర్‌రెడ్డి, యాదయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి ఉన్నారు.