
చుట్టూ కొండలు, దట్టమైన అడవిని తలపించేలా ఏపుగా పెరిగిన వృక్షాలు, ఎటు చూసినా పచ్చదనం, ఉషోదయాన కొండలపై నుంచి వీచే చల్లనిగాలి… సాయంత్రం అయితే చాలు పక్షుల కిలకిలరావాలు, నెమళ్ల నాట్యాలు, చెంగుచెంగుమని ఎగిరే జింకలు మనసును కనువిందు చేసే, ప్రకృతి పరవశింపజేసే ఎన్నో దృశ్యాలు… ఇవన్నీ వీరన్నపేటలోని డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సొంతం. పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ మహబూబ్‌నగర్ సమీపంలో 31ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 660 రెండు పడకల గదులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాయి. లక్నోలో జరిగిన ప్రభుత్వ సామూహిక గృహాల ప్రదర్శనలో ఉత్తమ మోడల్‌గా ఎంపికవ్వడంతో పాలమూరు పేరు మరోసారి జాతీయ స్థాయిలో వినిపించింది.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చు ట్టూ కొండలు, అడవిని తలపించే లా ఏపుగా పెరిగిన వృక్షాలు, ఎటు చూసినా పచ్చదనం, ఉషోదయాన కొండలపై నుంచి వీచే చల్లని గాలి.. సా యంత్రం అయితే చాలు పక్షుల కిలకిలరావాలు, నెమళ్ల నాట్యాలు, చెంగుచెంగుమని ఎగిరే జింకలు మనసును కనువిందు చేసే, ప్రకృతి పరవశింపజేసే ఎన్నో మధురమై న దృశ్యాలు. అలాంటి కొండలు, పచ్చందాల మధ్య నివసించాలని, ఉరుకులు పరుగుల జీవితాన ఇంటి వద్ద గడిపే కొద్దిపాటి సమయమైనా ప్ర శాంతంగా గడపాలని ఎవరికైనా ఉంటుంది. అంతటి డ్రీమ్ హౌస్ కలలను మహబూబ్‌నగర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నెరవేస్తున్నాయి. వీరన్నపేట డబుల్ బెడ్రూం కా లనీ అయిన కేటీఆర్‌నగర్ కూర్గ్, ఊటీని తలపిస్తున్నది. మహబూబ్‌నగర్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూ రంలో 31 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 660 రెండు పడకల గదులు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. లక్నోలో జరిగిన ప్రభుత్వ సామూహిక గృహాల ప్రదర్శనలో ఉత్తమ మోడల్‌గా వీరన్నపేట డబుల్ బె డ్రూం ఇండ్లు ఎంపికవ్వడంతో అందరి దృష్టి పాలమూరుపై పడింది.
దటీజ్ కేసీఆర్..
మహబూబ్‌నగర్ పట్టణంలో వీరన్నపేట ప్రాంతం చాలా వెనుకబడిన మురికివాడ. ఇక్కడి ప్రజలు సొంత ఇల్లు లేక, ఒకటే గదిలో తండ్రి, కొడుకులు, భార్య, పి ల్లలు కలిసి జీవితం గడిపే పరిస్థితి ఉండేది. అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న ఇండ్లు కూడా రేకుల షె డ్డును తలపించేవి. ఎండాకాలం వస్తే భయంకరమైన వేడి, వానకాలంలో పైకప్పులు సరిగా లేక ఇల్లంతా బురదమయం.. ఇదీ పరిస్థితి. ఇక్కడి ప్రజలు సొంత ఇల్లు కట్టుకోలేక ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు. ఈ క్రమం లో 2015 జనవరి 18న సీఎం కేసీఆర్ వీరన్నపేటను సందర్శించారు. అక్కడి ప్రజల పరిస్థితులను చూసి చ లించి ఇండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇ ల్లు ఇస్తామని వాగ్దానం చేశారు. ఈ మేరకు 2016 జూ న్లో 660 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం రూ.40 కోట్లు ఖర్చు చేసి ఇండ్లను నిర్మించింది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు.
సకల సౌకర్యాలతో ‘డబుల్’ ఇండ్లు..
డబుల్ బెడ్రూం ఇండ్లలో మెయిన్ రోడ్డు 30 ఫీట్లు ఉండేలా, ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చే మురుగునీటిని పైపుల ద్వారా సెప్టిక్ ట్యాంకుకు చేరేలా అధిక సా మర్థ్యం కలిగిన మూడు సెప్టిక్ ట్యాంకులను నిర్మించా రు. డ్రైనేజీ నీరు బయటకు వెళ్లేలా డ్రెయిన్ల నిర్మాణం, రోడ్లకిరువైపులా మొక్కలు, విద్యుత్ సౌకర్యం, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారు. వీరన్నపేట డబుల్ బెడ్రూం ఇండ్లను జూలై 13న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. అత్యంత వెనుకబడిన వీరన్నపేట ప్రాంతం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆలోచనతో రూపురేఖలు మారిపోయాయి. ఇండ్ల వద్దకు వెళ్లేందుకు బీటీ రోడ్డు ఏర్పా టు చేశారు. డబుల్ బెడ్రూం కాలనీ పక్కనే రూ.100 కోట్ల వ్యయంతో రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం, బృహత్ ప్రకృతి వనం ఏర్పాటు చకచకా జరిగిపోయా యి. దీంతో కనీసం ఒక్క ఇళ్లు కూడా లేని ప్రాంతంలో.. ఇప్పుడో అధునాతన టౌన్ షిప్‌ను తలపిస్తున్నది.
ఆహ్లాదకరమైన వాతావరణం..
వీరన్నపేటలో 31.75 ఎకరాల్లో 660 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాం. ఇప్పటివరకు ఇంతటి ప్రకృతి రమణీయత మధ్య ‘డబుల్’ ఇండ్లు ఎక్కడా చూడలేదు. సకల సదుపాయాలు కల్పించాం. సాంకేతికంగా మరో ఫ్లోర్ నిర్మించుకునేలా నిర్మించాం. విశాలమైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అత్యంత నాణ్యతతో ఉన్నాయి. ఒక్కో ఇంటికి రూ.5.34 లక్షలు ఖర్చు చేశాం.
దేశవ్యాప్త గుర్తింపు..
ఇటీవల లక్నోలో ఏర్పాటు చేసిన జాతీయ ప్రభుత్వ ఇండ్ల నిర్మాణ నమూనా ప్రదర్శనకు తెలంగాణ నుంచి వీరన్నపేట నమూనాను ఎంపిక చేసి పంపించారు. కేంద్ర ప్రదర్శన బృందం, పట్టణ ప్రాంత గృహ నిర్మాణ సెంట్రల్ టీం ఇన్చార్జితోపాటు, పలువురు కేంద్ర అధికారులు వీరన్నపేట డబుల్ బెడ్రూం ఇండ్ల నమూనాను ప్రశంసించారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన నూతన షేర్ వాల్ టెక్నాలజీ బాగుందన్నారు. అత్యుత్తమంగా ఉందని కితాబిచ్చారు.