
గణేశ్ ఉత్సవాలకు మండపాలు సిద్ధం
పోటాపోటీగా అలంకరణ
మహబూబ్‌నగర్/బాలానగర్/మిడ్జిల్, సెప్టెంబర్ 9 : జిల్లావ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఉత్సవ కమిటీల సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించేందుకు మండపాలను సిద్ధం చేశారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా పోటాపోటీగా మండపాలను అలంకరించారు. గురువారం గణేశ్ విగ్రహాలను మండపాలకు తరలించారు. శుక్రవారం వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య మండపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
నాగసాల చెరువు పరిశీలన
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 9 : మున్సిపాలిటీలోని నాగసాల చెరువును గురువారం ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్ల వివరాలను మున్సిపల్, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ సునీత, సీఐ వీరాస్వామి, ఎస్సై శంషొద్దీన్ ఉన్నారు.
మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 9 : పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో గురువారం మం డల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు మేడిశెట్టి రామకృష్ణ, పాలాది రామ్మోహన్, బెజగం చందు, శివ్వకిశోర్, మంచన గణేశ్, ఆనంద్‌రాజ్, కండె కృష్ణ, ప్రవీణ్‌కుమార్, బాదం ప్రకాశ్, మురళి పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, సెప్టెంబర్ 9 : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమకూర్చిన మట్టి వినాయక విగ్రహాలను మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్ గురువారం భూత్పూర్ చౌరస్తాలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ రజితారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, అజీజ్, స త్యనారాయణ, అశోక్, రాకేశ్, గడ్డం రాములు, బోరిం గ్ నర్సింహులు, బాలస్వామి, వెంకటయ్య, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.