
అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, సీతారామారావు
ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 9 : పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రజానికానికి అందించిన సేవలు మరవలేనివని అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, సీతారామారావు అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని గురువారం కలెక్టరేట్లో ఘనం గా నిర్వహించారు. ముందుగా కాళోజీ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కాళోజీ నారాయణరావు పీడిత ప్రజల పక్షాన నిలువడంతోపాటు తన జీవితాన్ని తెలంగాణకు అంకి తం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈ వో జ్యోతి, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
పలు కార్యాలయాల్లో..
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 9 : ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పలు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయంలో ఆ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో ఉషారాణి, స్టేడియంలో డీవైఎస్వో శ్రీనివాస్, పాలమూరు యూనివర్సిటీలో వైస్‌చాన్స్‌లర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ విజయకుమార్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక కాళోజీ
మూసాపేట, సెప్టెంబర్ 9 : తెలంగాణ జాతి అస్తిత్వానికి ప్రతీక ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ అన్నారు. మండలంలోని దాసరిపల్లిలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కమిటీల మండల ఇన్చార్జి మనెమోని సత్యనారాయణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, గూపని కొండయ్య, శివరాములు, మల్లయ్య, అనిల్‌కుమార్‌రెడ్డి, గోవిందరెడ్డి, రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 9 : ప్రజాకవి కాళోజి జయంతిని జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ సునీత పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, సెప్టెంబర్ 9 : మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి సర్పంచ్ కృష్ణయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఖాజా నవాజ్, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, పంచాయతీ కా ర్యదర్శి రమేశ్, నాయకులు జగన్‌గౌడ్, గౌస్, రామస్వా మి, శ్యామ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, సెప్టెంబర్ 9 : మండల పరిషత్, తాసిల్దార్ కార్యాలయాల్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుశీలారమేశ్నాయక్ కళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మండలంలోని తిర్మలాపూర్, చొక్కంపేట, దోండ్లపల్లి, రాయపల్లి గ్రామా ల్లో కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, సెప్టెంబర్ 9 : మండలంలోని శేరిపల్లి(హెచ్) ప్రాథమిక పాఠశాలలో కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శేఖర్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం రాంప్రభు, అంగన్వాడీ టీచర్ పుష్ప తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, సెప్టెంబర్ 9 : మండలకేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నర్విహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్, ఆర్ఐ జ్ఞానేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కాళోజీ జీవితం అందరికీ ఆదర్శం
బాలానగర్, సెప్టెంబర్ 9 : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందరికీ ఆదర్శమని సర్పంచ్ లలితామంజునాయక్ అన్నారు. మండలంలోని ఊటకుంటతండా గ్రామపంచాయతీ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జ్యోతి, సింగిల్‌విండో డైరెక్టర్ మం జునాయక్, పంచాయతీ కార్యదర్శి నరేశ్ పాల్గొన్నారు.