
మహబూబ్‌నగర్, అక్టోబర్ 7 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల్లో దుర్గామాతను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అలాగే ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండ వెంకటేశ్ స్వగృహంలో వాసవీమాత ఆభరణాలు, బంగారు చీరె, పట్టువస్ర్తాలకు పూజ లు చేశారు. అనంతరం ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారిని ఉమాదేవిగా అలంకరించారు. అలాగే దేవీనగర్‌లోని కాళికాదేవి మహాకాళేశ్వరస్వామి ఆలయంలో కాళికామాత ఉమాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత ఐశ్వర్యేశ్వర స్వామి పట్టువస్ర్తాలు, ఆభరణాల పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సతీమణి శారద పాల్గొన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్ కోట్ల నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిలు, ఆలయ కమిటీ సభ్యులు చంద్రమౌళి, శ్రీను, రమేశ్‌నాయక్, ఆలయ కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, కోశాధికారి తల్లం నాగరాజు, ఎదిర ప్రమోద్‌కుమార్, కొండ చక్రధర్గుప్తా, కలకొండ బాలకిష్టయ్యగుప్తా, విజయ్‌భాస్కర్, కొండారి వెంకట్రామయ్య, సురేశ్, వినో ద్, శేఖర్, పల్లా శ్రీను, సుదర్శన్, నరేశ్ పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, అక్టోబర్ 7 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పు రస్కరించుకొని మండలంలోని వేపూర్, హన్వాడ, మునిమోక్షం, ఇబ్రహీంబాద్, టంక ర, పెద్దదర్పల్లి గ్రామాల్లో దు ర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠిం చి ప్రత్యేక పూజలు చేశారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, అక్టోబర్ 7 : ఉమ్మ డి గండీడ్ మండలంలోని వెన్నాచేడ్, సల్కర్‌పేట, పెద్దవార్వల్, గండీడ్, మన్సూర్పల్లితండా, మ హ్మదాబాద్, గాధిర్యాల్, నంచర్ల, జూలపల్లి, మొకర్లాబాద్, వెంకట్‌రెడ్డిపల్లి, కంచన్‌పల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో దుర్గామాత కొలువుదీరారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, అక్టోబర్ 7 : మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో గణపతిపూజ, అఖండ దీపారాధన, కలశస్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాశం గోపాల్, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ రూర ల్ సీఐ మునీశ్వర్రావు, నవాబ్‌పేట ఎస్సై శ్రీకాంత్, నాయకులు పాశం కృష్ణయ్య, పాశం నరేందర్, నర్సింహులు, మా ధవులు, సుభాన్చారి, వేణాచారి పాల్గొన్నారు.
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 7 : అడ్డాకుల, మూసాపేట మండలకేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారి మండపాలకు పెద్దఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం బతుకమ్మ ఆడారు.
దేవరకద్ర సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, అక్టోబర్ 7 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవరకద్ర, కౌకుంట్ల, పేరూర్, గోపన్‌పల్లి, లక్ష్మీపల్లి, వెంకటాయపల్లితోపాటు చిన్నచింతకుంట, పర్ధీపూర్ తదితర గ్రామాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. కౌకుంట్లలో దుర్గామాతకు 2013 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు ముక్కుపుడక సమర్పించారు. మొదటిరోజు అమ్మవారు స్వర్ణకవచధారిగా భక్తులకు దర్శనమిచ్చారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, అక్టోబర్ 7 : జడ్చర్ల మండలంలోని పలు గ్రామాలతోపాటు మున్సిపాలిటీలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యా యి. మున్సిపాలిటీలోని సకలదేవతల ఆలయం లో అమ్మవారు స్వర్ణకవచ అలంకృతా దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో రాఘవేందర్, జయమ్మ, కవిత, బాలేశ్వరి, లావ ణ్య, సుధారాణి పాల్గొన్నారు. అలాగే బాదేపల్లి కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో ఆర్యవైశ్య యు వజన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గణపతిపూజ, ధ్వజారోహణం, కుంకుమార్చన, అమ్మవారికి విశేష పూజలు చేశారు. మొదటిరోజు అమ్మవారు గౌరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో మెడిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. గొల్లపల్లి లలితాంభికా తపోవనంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, అక్టోబర్ 7 : మండలకేంద్రంతోపాటు మల్లాపూర్, వేముల, వల్లభురావుపల్లి గ్రామాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణకవచధారిగా భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయాల కమిటీ అధ్యక్షుడు ఎడ్ల శంకర్, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్, శ్రీనివాస్‌రెడ్డి, కుమార్, రామకృష్ణ, రాఘవేందర్, రాజేశ్వర్, వెంకట్‌రెడ్డి, గంజి శేఖర్, విజ య్, భాస్కరాచారి, మల్లయ్య, మల్లాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు బంగారు, సత్యం, శేఖర్, సైదు లు, శ్రీకాంత్, భాస్కర్, మహేశ్ పాల్గొన్నారు.
దైవచింతన అలవర్చుకోవాలి
భూత్పూర్, అక్టోబర్ 7 : ప్రతిఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ కోరారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూ జలు చేశారు. మొదటిరోజు బాలాత్రిపురాసుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షు డు అశోక్‌గౌడ్, గొడుగు రాజు, కృష్ణయ్యగౌడ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, అక్టోబర్ 7 : మండలకేంద్రంతోపాటు పెద్దరేవల్లి, గంగాధర్‌పల్లి గ్రామాల్లో మొద టి రోజు స్వర్ణకవచాలంకృతాదేవిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్య క్రమంలో కొమురమ్మ, శశికాంత్‌రెడ్డి, తిరుపత య్య, మల్లేశ్, వెంకటేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.