
దామరగిద్ద, సెప్టెంబర్ 7 : మండలంలోని వివిధ గ్రా మాల్లో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలకేంద్రంలోని సంజీవరాయాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకా లు, హారతి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని కానుకుర్తిలో భోవమవ్వ ఉత్సవాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో జల్దిబిందె, బోనం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమం లో మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమం
నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 7 : జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో కళబెళగుంది బనదేశ్వరాలయంలో అమావాస్య సందర్భంగా మంగళవారం స్వామి వారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ చేశారు. భ క్తులు, మహిళలు దర్శించుకొని మొ క్కులు చెల్లించుకున్నారు.
మండలంలో…
మండలంలోని జాజాపూర్ చౌడేశ్వ రి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు సా యంత్రం ఆలయంలో దేవాంగ సమా జం మహిళలంతా భజన చేస్తారు. శ్రా వణమాసం ముగింపు సందర్భంగా భ క్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
లోకపల్లిలో…
ఏక్లాస్పూర్ శివారులోని లోకపల్లి లక్ష్మమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు తీర్థప్రసాదా లు పంపిణీ చేశారు. ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో హా జరై అమ్మవారిని దర్శించుకున్నారు.
అయ్యప్పస్వామి ఆలయంలో…
నారాయణపేట, సెప్టెంబర్ 7 : అమావాస్యను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, నైవేద్యం, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ చేపట్టా రు. దామరగిద్ద మండలం కంసాన్పల్లి స ర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు గురునాథ్గౌ డ్ భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మనోహ ర్ ప్రసాద్‌గౌడ్, భక్తులు పాల్గొన్నారు.
జల్దిబిందె ఊరేగింపు
మాగనూర్, సెప్టెంబర్ 7 : మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి జల్దిబిందె ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏటా శ్రావణమాసం తర్వాత వచ్చే అమావాస్య రోజు జల్దిబిందె ఊరేగింపు కా ర్యక్రమాన్ని నిర్వహిస్తామని సర్పంచ్ రాజు అన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చె ల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుధాఆంజనేయు లు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.