ముకరంపుర, మే 11: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్)తోనే కా ర్మికులకు మేలు జరుగుతుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ అధ్యక్షతన బుధవారం టీఆర్వీకేఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ టీఆర్వీకేఎస్ విద్యుత్ కార్మికులకు అండగా ఉంటుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేయడంతోనే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందని చెప్పారు.
కేంద్రం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభు త్వం వారిని ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. కార్మికులు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు. ఈపీఎఫ్-జీపీఎఫ్ 2004వరకు, పీఆర్సీ-2022తో పాటు ఉద్యోగులకు ప్రమోషన్లు, ఆర్టీసన్ కార్మికులకు సంబంధించిన సమస్యలు, బిల్లులు వసూలు చేసే సిబ్బంది, అన్మ్యాన్డ్ హమాలీలు, హోంగార్డు సమస్యల సాధనపై సమావేశంలో తీర్మానించగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
సమావేశంలో పలు జిల్లాలకు చెందిన కార్మికులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కరీంనగర్ నగర మేయర్ వై సునీల్‌రావు సమక్షంలో 225మంది కార్మికులు టీఆర్‌వీకేఎస్‌లో చేరగా వారికి సంఘం కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే అనేక రాష్ర్టాల్లో కరెంట్ సంక్షోభం ఉన్నదని, కానీ కార్మికుల కృషితో తెలంగాణలో నిరంతర సరఫరా సాధ్యమవుతుందని చెప్పారు.
ఈ సమావేశంలో ఎస్ఈలు గంగాధర్, వేణుమాధవ్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్కో కంపెనీల నాయకులు గుగులోతు రాందాస్ నాయక్, బీ ప్రభాకర్, కరెంటురావు, యూసుఫ్, రఘోత్తం, సీహెచ్ రమేశ్, దేవేందర్‌రెడ్డి, ఎంఏ అజీజ్, ఎస్ మనీందర్, రవి, తిరుపతి, గణేశ్, మోహన్‌రెడ్డి, మీర్జాన్, తదితరులు పాల్గొన్నారు.