బోయినపల్లి, మే 8: స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన ప్రముఖ కంటి వైద్యుడు, హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్ వైరాగ్యం రాజలింగానికి సొంతూరైన కొదురుపాకలో అరుదైన గౌరవం దక్కింది. టీఆర్ఎస్ రాష్ట్ర నేత జోగినపల్లి రవీందర్రావు నేతృత్వంలో రాజలింగం-రీటా బహదుర్షా దంపతులను గ్రామ ఆర్అండ్ఆర్ కాలనీలోని బీ సీఎం కంటి దవాఖానలో పూలమాలలు వేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం దవాఖానలో స్వీట్లు పంపిణీ చేశారు. కాగా, ప్రభుత్వం ఇటీవలే రాష్ట్ర వైద్యమండలిని పునర్వ్యవస్థీకరించింది.
శనివారం చైర్మన్‌గా రాజలింగంను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామానికి వచ్చిన వారిని గ్రామస్తులు, టీఆర్ఎస్ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ ఎందరో నిరుపేదలకు కంటిచూపును ప్రసాదించిన రాజలింగం సేవలను గు ర్తించి సర్కారు ఈ అవకాశం ఇవ్వడం అభినందనీయమన్నారు. ఆయన వల్ల గ్రామానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. రాజలింగం భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, వైస్‌ఎంపీపీ కొనుకటి నాగ య్య, కొదురుపాక ఉపసర్పంచ్ రవిచందర్, వెంకట్రావ్పల్లి సర్పంచ్ బూర్గుల నందయ్య, ఎంపీటీసీ ఉపేందర్, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నేత అనుముల భాస్కర్, టీఆర్ఎస్వై చైర్మన్ కట్ట గోవర్ధన్, నేతలు చిక్కాల సుధాకర్‌రావు, నాగుల నాగరాజు, సంబ లక్ష్మీరాజం, ఈడ్గు స్వామి, ఐరెడ్డి మల్లారెడ్డి, కొండం నారాయణరెడ్డి, బుర్ర పూర్ణ చందర్, కత్తెరపాక రవీందర్, కమల్, ఎర్ర మల్లయ్య, గుడ్ల శ్రీనివాస్, గంగారెడ్డి, నల్లగొండ అనిల్, సాగర్, ఎడపెల్లి బాబు, సందిల దేవయ్య ఉన్నారు.