చొప్పదండి, ఏప్రిల్ 13: యాసంగి వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, సర్పంచులు గుంట రవి, దామెర విద్యాసాగర్‌రెడ్డి, వెల్మ నాగిరెడ్డి, పెద్ది శంకర్, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు నలుమాచు రామకృష్ణ, ఏనుగు స్వామిరెడ్డి, కొత్తూరి నరేశ్, వడ్లకొండ శ్రీనివాస్, దండె కృష్ణ, నందిరెడ్డి, ఐలయ్య, తోడేటి డేవిడ్, తిరుపతిరెడ్డి, మునిగాల నారాయణ, గాండ్ల లక్ష్మణ్, మల్లేశం, నర్సయ్య, స్వామి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, ఏప్రిల్ 13: వెలిచాలలోని తెలంగాణతల్లి కూడలిలో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, సర్పంచ్ వీర్ల సరోజన, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, ఆర్బీఎస్ సభ్యులు వీర్ల సంజీవరావు, జూపాక కరుణాకర్, పెరుమాండ్ల శ్రీనివాస్‌గౌడ్, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ దాసరి రాజేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు, ఉప సర్పంచ్ పూదరి వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు ఆరపెల్లి ప్రశాంత్, చిమ్మల్ల మహేశ్, వంగ రమణ, ప్రశాంత్, శెట్టి సుధాకర్, పోచమల్లు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, ఏప్రిల్ 13: కాసారం, గర్శకుర్తి గ్రామాల్లో బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించి సీఎం కేసీఆర్ మరోసారి రైతు పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ వేముల దామోదర్, నాయకులు అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, మామిడిపెల్లి అఖిల్, దూస అనిల్, పల్ల మల్లిక్, పిట్టల మహేందర్, రైతులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 13: చామనపల్లిలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య మాట్లాడారు. మోసం చేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ బోగొండ లక్ష్మి-ఐలయ్య, బందారి లింగయ్య, తాళ్లపల్లి ఎల్లాగౌడ్, అంజయ్య, వెంకటేశ్వర్లు, రవీందర్, మల్లేశం, శంకరయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. చెర్లభూత్కూర్‌లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు కూర శ్యాంసుందర్ రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ తిరుపతి, పంది తిరుపతి, కూర నరేశ్‌రెడ్డి, శ్రీను, ఆనంద రెడ్డి, నారాయణ రెడ్డి, రాజిరెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చేగుర్తిలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గాండ్ల కొమురయ్య, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రైతులకు స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో దుర్శేడ్ సింగిల్ విండో డైరెక్టర్ గాండ్ల అంజయ్య, ఎల్కపల్లి చంద్రమోహన్, సత్తు కిషన్, లక్ష్మీనారాయణ, కోటి రాజు, సంపత్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. దుర్శేడ్‌లో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీరామోజు తిరుపతి ఆధ్వర్యంలో రైతులు పంట పొలాల్లో సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, టీఆర్ఎస్ యూ త్ అధ్యక్షుడు శ్రీనివాస్, వేణుమాధవ్‌రావు, రాజ్‌కమల్, మహేశ్, రాజు, మహేశ్వర్, సతీశ్, రామచంద్రం, అనిల్, మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తీగలగుట్టపల్లిలో ఆర్బీఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు మూల వెంకటరవీందర్‌రెడ్డి, మూల రాజిరెడ్డి, దాసరి వినోద్, బొల్లాడి మల్లారెడ్డి, అనిల్, గాండ్ల నారాయణ, అంజన్న, కూడలి అశోక్, గుండు రాంమూర్తి, వడ్లకొండ వినయ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.