రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ బర్త్‌డే వేడుకలు ఆదివారం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కేక్‌లు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. పలు ఆశ్రమాల్లో పండ్లు, పాలు పంపిణీ చేశారు. రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దర్గాల్లో చాదర్ సమర్పించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కార్పొరేషన్/కలెక్టరేట్, మే 8: నగరంలోని మేయర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ సునీల్‌రావు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకులు అనిల్, రామకృష్ణారావు, వెంకట్రావు, ప్రకాశ్, అంజన్‌రావు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో 54 కిలోల భారీ కేక్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావు కట్ చేశారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, టీఆర్ఎస్ మైకెల్ శ్రీనివాస్, మధు, కర్ర రాజశేఖర్, పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత-చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన మంత్రి గంగుల భారీ కటౌట్ ఎదుట కేక్‌ను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావు కట్ చేశారు.
అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్పొరేటర్ వాల రమణారావు, నాయకులు నందెల్లి మహిపాల్, కర్ర రాజశేఖర్, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో నగరంలోని మార్కెట్రోడ్లో గల వేంకటేశ్వరస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలు, కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. టీఆర్ఎస్వీ నాయకులు శ్రవణ్, మధు, రవిగౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భగత్‌నగర్‌లో కార్పొరేటర్ తోట రాములు ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, నాయకులు కోటి, ఆనంద్, వెంకట్ పాల్గొన్నారు. మీ సేవ కార్యాలయంలో మంత్రి పీఏలు కిషన్‌ప్రసాద్, మహేందర్‌తో పాటు 30 మంది మంత్రి వ్యక్తిగత సహాయకులు, కార్యాలయ సిబ్బంది రక్తదానం చేశారు.
కంసాల శ్రీనన్న యువసేన ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ కేక్ కట్ చేయగా, యువసేన అధ్యక్షుడు సంపతి అశోక్, నాయకులు కులదీప్, గడ్డం వీరేందర్, దరిపల్లి క్రాంతి, మారుమూల సాంబయ్య, జల్లి కోటేశ్వర్, గసికంటి శ్రవణ్, దీకొండ ప్రభాకర్ పాల్గొన్నారు. జీకే యూత్ ఆధ్వర్యంలో మూడో డివిజన్ కిసాన్‌నగర్‌లో కేక్ కట్ చేసి కాలనీవాసులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమం లో యూత్ అధ్యక్షుడు మొగిలోజు వెంకట్, నాయకులు పూసల శ్రీకాంత్, రవికాంత్, రవియాదవ్ పాల్గొన్నారు. అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా, కార్పొరేటర్ తోట రాములు, గుం డా శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అశోక్, శ్రీనివాస్, రమణారెడ్డి, పెంచాల కిషన్, తిరుపతి, సత్యనారాయణ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ యూత్ డివిజన్ ఉపాధ్యక్షుడు సుఫియాన్ ఆధ్వర్యంలో ఏడో డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ఆకుల ప్రకాశ్ కేక్ కట్ చేసి స్వీ ట్లు పంపిణీ చేశారు. వృద్ధులకు పండ్లు, పాలు, రొట్టెలు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు నామాల శ్రీనివాస్, వసంతరావు, తోట రాజేందర్ పాల్గొన్నారు. 18వ డివిజన్ రేకుర్తిలో కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా, 19వ డివిజన్ కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్కేవీ, ఆర్పీల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రోగులకు పండ్లు, పాలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీత, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, 50 మంది ఆర్పీలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతీరా వు ఫూలే పార్క్‌లో టీఆర్ఎస్ నాయకురాలు గందె కల్పన-విశ్వేశ్వర్రావు ఆధ్వర్యంలో వాకర్స్‌కు జావ పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ వాల రమణారావు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్పొరేటర్ నేతికుంట యాదయ్య, నాయకులు పిట్టల శ్రీనివాస్, దండబోయిన రాము, బిజిగిరి నవీన్, ఎలగందుల ప్రకాశ్, తుల రమణారావు, కొట్టె రవీందర్, విక్కీ పాల్గొన్నారు. కార్పొరేటర్ ఎడ్ల సరిత-అశోక్ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో 500 మందికి పుచ్చకాయలు పంపిణీ చేశారు. నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కార్ఖానగడ్డలోని వృద్ధుల ఆశ్రమంలో కార్పొరేటర్లు మేచినేని వనజ-అశోక్‌రావు, అర్ష కిరణ్మయి-మల్లేశం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయగా, మేయర్ సునీల్‌రావు, పవన్, రాజు పాల్గొన్నారు. గాంధీచౌక్‌లో కార్పొరేటర్ నక్క పద్మ-కృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా నాయకులు సరిళ్ల ప్రసాద్, ఆనంద్, రవి పాల్గొన్నారు. కార్పొరేటర్ సరిళ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో నెహ్రూ విగ్రహం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకుడు సముద్రాల మధు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్పొరేటర్ వంగల శ్రీదేవి-పవన్‌కుమార్ ఆధ్వర్యంలో పాతబజార్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదానం చేశారు.
కార్పొరేటర్ జంగిలి ఐలేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో బాలగోకులం అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పద్మనగర్‌లో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా నాయకుడు శ్రీరాములు పాల్గొన్నారు. కార్పొరేటర్ గందె మాధవి-మహేశ్ ఆధ్వర్యంలో రాంనగర్‌లోని భవిత వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకుడు తోట మధు ఆధ్వర్యంలో భగత్‌నగర్ శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్ నాయకుడు వైజీపీ స్వామి ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అన్నదానం చేశారు. మైనార్టీ నాయకులు దర్గాల్లో చాదర్ సమర్పించి, ప్రార్థనలు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర గ్రంథాలయంలో మొక్కలు నాటి, విద్యార్థులకు మిఠాయిలు పంచారు.
తెలంగాణచౌక్, మే 8: కుల సంఘాల జేఏసీ చైర్మన్ జీఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా నాయకులు లింగమూర్తి, మధుసూదన్, రమేశ్, శ్రీధర్, కొలిపాక శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆటో యూనియన్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో కేక్ కట్ చేయగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్, న్యాయవాది గజ్జల ఆనందరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాదాసి ప్రభాకర్, గోస్కి శంకర్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూప, సతీశ్ పాల్గొన్నారు.
హౌసింగ్‌బోర్డుకాలనీ, మే 8: 47 డివిజన్ మీకోసం కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. హౌసింగ్‌బోర్డుకాలనీ శ్రీవీరబ్రహ్మేంద్ర అనాథ, వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేశారు. స్వీట్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎండీ అహ్మద్ మొహినొద్దీన్, నాయకులు బాబుజానీ, ముంతాజ్ బాబుజానీ, అన్వర్‌ఖాన్, మున్నాషాఖాన్, ఎండీ మిరాజ్, అన్నపూర్ణ, గూట్ల శంకర్, సంపత్ తదితరులున్నారు.
విద్యానగర్, మే 8: ఎస్సారార్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆర్టీసీ నాయకుడు జక్కుల మల్లేశం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జ్యోతీరావు ఫూలే జిల్లా అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ బీ శ్రీనివాస్, నాయకులు సూర్యశేఖర్, ప్రసాద్, గంగరాజం, నారాయణరెడ్డి, సంతోష్, శ్రీనివాస్, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మీ సేవ కార్యాలయంలో దవాఖానల్లో పనిచేసే సిబ్బంది, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే సుమారు 20 మంది రక్తదానం చేశారు. సైంటిస్ట్ జవ్వాజి హరికృష్ణ, పుల్లెల సుధీర్, డాక్టర్ హారతికౌసర్, ప్రభాకర్, రమేశ్, హరీశ్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు. 19వ డివిజన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కమాన్‌చౌరస్తా/మానకొండూర్ రూరల్, మే 8: 8వ డివిజన్ అల్గునూర్‌లో కార్పొరేటర్ సల్లా శారద-రవీందర్, కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు జాప శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కంది రాంచంద్రారెడ్డి, నాయకులు సల్లా మహేందర్, చిల్లా పరశురాములు పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీలో టీఆర్ఎస్వీ ఇన్చార్జి చుక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నాయకులు బొంకూరి మోహన్, కొలవురి చంద్రశేఖర్, విక్రమ్, సాయి గణేశ్, సచిన్, సాయి ప్రణయ్, ప్రణీత్, వెంకటేశ్, పవన్, కిరణ్, శ్రీరామ్ పాల్గొన్నారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్పొరేటర్ ఎడ్ల సరిత-అశోక్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన పేద యువతి కొంపల్లి మాలతి వివాహానికి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. టీఆర్ఎస్ నాయకురాలు గందె కల్పన-విశ్వేశ్వర్రావు ఆధ్వర్యంలో జ్యోతీరావు ఫూలే మైదానంలో కార్పొరేటర్ వాల రమణారావు చేతులమీదుగా వాకర్స్‌కు జావ పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్పొరేటర్ నేతికుంట యాదయ్య, నాయకులు పిట్టల శ్రీనివాస్, దండబోయిన రాము, బిజిగిరి నవీన్, ఎలగందుల ప్రకాశ్, తుల రమణారావు, రవీందర్, వికీ వాకర్స్ పాల్గొన్నారు. అల్గునూర్ పరిధిలోని సదాశివపల్లిలో వేడుకలు నిర్వహించారు.
ముకరంపుర, మే 8: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనిత-ఆంజనేయులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. 300మందికి అన్నదానం చేయగా కార్యక్రమాన్ని మేయర్ సునీల్‌రావు ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కార్పొరేటర్ ఎడ్ల సరిత-అశోక్, మహేశ్వరి, ఏఎంసీ డైరెక్టర్లు పాల్ల్గొన్నారు.