పోటీ పరీక్షలు అనగానే యువతలో తెలియని భయం ఉంటుంది. ఎలా ప్రిపేర్ కావాలి? ఏం చదవాలి? ఎలా చదవాలి? ఒత్తిడిని ఎలా జయించాలి? గమ్యాన్ని ఎలా చేరుకోవాలి? ఇలా ఎన్నో సందేహాలు వెంటాడుతాయి. ఇలాంటి తరుణంలో ‘నమస్తే తెలంగాణ’,‘తెలంగాణ టుడే’ సువర్ణావకాశం కల్పిస్తున్నది. పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ సౌజన్యంతో నేడు ఉచిత అవగాహన సదస్సును నిర్వహిస్తున్నది. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ ప్యాలెస్‌లో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఈ సదస్సుకు వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ మల్లవరపు బాలలతతో పాటు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ ప్రధాన వక్తలుగా హాజరుకానున్నారు. అభ్యర్థుల భయాలు, అనుమానాలు తొలగించడంతోపాటు పోటీ పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షలు అనగానే చాలా మందిలో తెలియని భయం ఉంటుంది. ఎలా ప్రిపేర్ కావా లి? ఏం చదవాలి? సిలబస్‌పై ఎలా అవగాహన పెంచుకోవాలి? ఒత్తిడిని ఎలా జయించాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇలా ఎన్నో సందేహాలు వెంటాడుతాయి. ఇలాంటి సమయంలో అభ్యర్థులకు అండగా నిలుస్తున్నది ‘నమస్తే తెలంగాణ’,‘తెలంగాణ టుడే’.నిపుణుల సలహాలు, ప్రామాణిక స్టడీ మెటీరియల్‌తో ఇప్పటికే నిపుణ పేరిట ప్రత్యేక సంచిక ఇస్తున్నది. ఉగాది నుంచే ప్రతిరోజు జిల్లా టాబ్లాయిడ్లో నాలుగు పేజీలు (ఇంగ్లిష్, తెలుగు మీడియంలో), ప్రతి బుధవారం ఎనిమిది పేజీల ప్రత్యేక అనుబంధం ఇస్తున్నది. తాజాగా నోటిఫికేషన్లు విడుదలవుతున్న సమయంలో అభ్యర్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నది.
జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ సౌజన్యంతో నేడు ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ ప్యాలెస్‌లో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. సుమారు వెయ్యి మంది అభ్యర్థులకు సరిపడేలా ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సుకు వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ మల్లవరపు బాలలతతో పాటు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ ప్రధాన వక్తలుగా హాజరుకానున్నారు.
అభ్యర్థుల భయాలు, అనుమానాలు తొలగించడంతోపాటు పోటీ పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇలాంటి సదస్సులు ఉద్యోగార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, లక్ష్యాలను చేరుకోవడంలో కీలకంగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.