కలెక్టర్ శృతిఓఝా
గద్వాల, ఆగస్టు12 : జిల్లాలోని ప్రభుత్వ,ప్రైవేట్ జూనియర్, డిగ్రీకళాశాలలో పెండింగ్‌లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ శృతిఓఝా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో ఉన్న 54కళాశాలల్లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం వచ్చిన దరఖాస్తులను సరిచూసి ఆధార్ అథెంటికేషన్ చేయాలన్నారు. దరఖాస్తులను పూర్తిచేస్తే విద్యార్థులకు లాభం చేకూరుతుందని తెలిపారు. 2017-18, 2018-19, 2019-20, 2020-21 విద్యాసంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 17వరకు పూర్తి చేయాలని, విద్యార్థుల ఫోన్ నెంబర్, అడ్రస్ పూర్తి సమాచారం తీసుకొని సంబంధిత శాఖ అధికారులకు అందజేయాలన్నారు. కళాశాలల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్డీవో శ్వేత, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ప్రసాద్‌రావు, బీసీ సంక్షేమశాఖ అధికారి కేశవులు, నోడల్ అధికారి హృదయరాజు తదితరులు పాల్గొన్నారు.