క్వాటర్కు రూ.30, బీరుకు రూ.20అదనంగా వసూలు
షాపుల నిర్వహణకు వేలం..!
మామూళ్ల మత్తులో ఆబ్కారీ అధికారులు
గద్వాల న్యూటౌన్, ఆగస్టు 21 : జోగుళాంబ గద్వాల జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరుగా సా గుతున్నది. ఏ మారుమూల ప్రాంతంలో అయి నా.. ఏ సమయంలో అయినా మద్యం లభించే ప రిస్థితి నెలకొన్నది. పల్లెల్లో 24 గంటలూ మద్యాన్ని విక్రయిస్తున్నారు. గల్లిగల్లికో బెల్టు పాపు అన్న చం దంగా జిల్లాలో వందకు పైగా బెల్టు దుకాణాలు అ నధికారంగా నడుస్తున్నట్లు సమాచారం. ఇక గ్రా మాల్లో అయితే బెల్ట్ షాపుల నిర్వాహణకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏమేర ఉందో అర్థం చేసుకోవచ్చు.
కిరాణ షాపులే అడ్డా..
గ్రామాల్లో చిన్న కిరాణ షాపులే మద్యం విక్రయాలకు ప్రధానంగా అడ్డాలుగా మారాయి. మరికొన్ని చోట్ల తడకలు వేసి చిన్నసైజు కల్లు దుకాణం లా మార్చి బెల్ట్ షాపును నడిపిస్తున్నారు. జిల్లా కేం ద్రంతో పాటు శివారు ప్రాంతాల్లో బెల్ట్ షాపులున్నట్లు తెలుస్తుంది. గద్వాల మండలంలోని ముల్కల్పల్లి, బీరెల్లి, కాకులారం, పూడురు, వీరాపురం, గోన్పాడు, మేలచెర్వు, అలంపూర్ మండలంలోని కోనేరు, గొందిమల్ల, క్యాతూరు, సుల్తానపురం, అయిజలోని వెంకటపురం, పులికల్, మల్దకల్లోని ఎల్కూరు, మల్లెందొడ్డి, బిజ్వారం, రాజోళి, శాంతినగర్, వడ్డేపల్లి, ఇటిక్యాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు తదితర గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. బెల్ట్ షాపుల్లో క్వాటర్కు రూ.30, బీరుకు రూ.20 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
షాపుల నిర్వాహణకు వేలం..
గ్రామాల్లో బహిరంగ వేలం ద్వారా బెల్ట్ షాపు లు నిర్వహిస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహించడం చట్టవిరుద్ధమైనా.. ప్రజాప్రతినిధుల అండతో కొన్ని గ్రామాల్లో ఏకంగా బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని ఇటిక్యాల మండలం శివనంపల్లి గ్రామంలో ఈనెల 7న బెల్ట్ షాపుల నిర్వహణకు బహిరంగ వేలం పాట నిర్వహించా రు. ఈ వేలం పాటలో నలుగు రు పాల్గొనగా, ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.12వేలకు బెల్ట్ షాపు దక్కించుకున్నాడు. గ్రామ పెద్దలతోపాటు ప్రజాప్రతినిధులు వేలం పా టను పర్యవేక్షించడం విశేషం. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు.
పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు..
జిల్లాలో బెల్ట్ షాపులున్న విషయం అందరికీ తెలుసు. కానీ సంబంధిత అధికారులకు మాత్రం ఎందుకు తెలియడం లేదో అర్ధం కావ డం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గద్వా ల మండలంతోపాటు అయిజ, మల్దకల్, ధరూ ర్, కేటీదొడ్డి, గట్టు, రాజోళి, అలంపూర్ తదితర మండలాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగుతున్నట్లు ఆరోపణలు వి నిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చ ర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నా రు. ఈ విషయంపై జిల్లా మధ్య నిషేద, ఆబ్కారీశాఖాధికారి సైదులును వివరణ కోరగా బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటాం. శివనంపల్లి బహిరం గ వేలం పాట నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో విచార ణ చేపట్టామన్నారు. కేసులు నమోదు చేస్తామని స్థాని కులు, ప్రజా ప్రతిని ధులను హెచ్చరిం