ఊట్కూర్, సెప్టెంబర్ 20 : మండలంలోని మొగ్దుంపూర్, పులిమామి డి, మల్లేపల్లి, తిప్రాస్‌పల్లి తదితర గ్రా మాల్లో సోమవారం కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించారు. కొవిడ్ నియంత్రణ కు ప్రతిఒక్కరూ విధిగా టీకా వేయించుకోవాలని ఆయా గ్రామాల సర్పంచులు సుశీలమ్మ, మాణిక్యమ్మ, సు మంగళ ప్రజలను కోరారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ కేంద్రాల పరిశీలన
కృష్ణ, సెప్టెంబర్ 20 : కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఎంపీడీవో శ్రీనివాసులు పరిశీలించారు. మండలంలోని మూడుమాల, తంగిడిగి, గుడెబల్లూర్ తదితర గ్రామాల్లో పర్యటించి టీకా సెంటర్లను వైద్య సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చూడాల ని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామ కార్యదర్శులతో మాట్లాడి, ప్రతిఒక్కరూ టీకా తీసుకునే విధంగా ప్రజలకు వివరించాలన్నారు. క్యాక్రమం లో ఎంపీవో విజయలక్ష్మి, డాక్టర్ శ్రీమంతు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
టీకా సెంటర్ల తనిఖీ
దామరగిద్ద, సెప్టెంబర్ 20 : మండలంలోని అ న్నాసాగర్, విఠలాపూర్ తదితర గ్రామాల్లో నిర్వహిస్తున్న కరోనా కేంద్రాలను ఎంపీపీ బక్క నర్స ప్ప తనిఖీ చేశారు. విఠలాపూర్‌లో టీకా కేంద్రాన్ని సందర్శించిన సమయంలో ఎంపీపీ పుట్టిన రోజు తెలుసుకున్న వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీ కిషన్‌రావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆశన్న, నాయకులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలి
మద్దూర్, సెప్టెంబర్ 20 : టీకాను ప్రతిఒక్క రూ వేయించుకోవాలని ఎంపీడీవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని బీంపూర్, మద్దూర్, రే నివాట్ల, భూనేడ్, లక్కయపల్లి, నిడ్జింత, గోకుల్ నగర్, నగంపల్లి తదితర గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకుంటేనే మహమ్మరిని తరిమికొట్టా వచ్చాన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, సర్పంచులు, కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కరోనాను జయించాలి
మాగనూర్, సెప్టెంబర్ 20 : కరోనాను జయించాలని ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొతపల్లి, ఓబులాపూర్, మందిపల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన టీకా సెంటర్లను ప రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 18 ఏండ్లు నిండిన వారికి టీకా వేయాలని అన్నారు. సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలన్నా రు. కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.