మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ
గద్వాల అర్బన్, ఆగస్టు 20 : ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ వారి సంక్షేమం కోసం పాటు పడుతున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్సే అని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో ఐఐఐటీ కళాశాల భూమి పరిశీలన రిపోర్ట్ రావడానికి సమయం పట్టడం, అలాగే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అనారోగ్య కారణాల దృష్ట్యా మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడిందే తప్పా మరే కారణం లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 10వ తేదీ లోపు తప్పనిసరిగా మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. అభివృద్ధి , సంక్షేమ పథకాలు తెచ్చినందుకు ప్రజల్లో టీఆర్ఎస్ నాయకులు ధైర్యంగా తీరుగుతున్నామన్నారు. 40 ఏండ్లుగా రాష్ర్టాని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని వారు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాని విమర్శించడం హస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి స్థాయిని తగ్గించుకొని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం లేక రెండు దఫాలుగా టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టారు. కార్యాక్రమంలో నాయకులు మహేశ్, ధర్మనాయుడు, గోవింద్, రాజు ఉన్నారు.