హసన్, హుస్సేన్‌ల పీర్లను దర్శించుకున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మత సామరస్యానికి ప్రతీక ‘మొహర్రం’
నైవేద్యం సమర్పించిన మొక్కులు తీర్చుకున్న భక్తులు
ఊట్కూర్, ఆగస్టు 20 : సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవడంతోపాటు, వాటిని కాపాడడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో హసన్, హు స్సేన్ పీర్ల చావిడీలను ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఊరేగింపుగా బయలుదేరి దర్శించుకున్నారు. హసన్, హుస్సేన్‌లకు సంప్రదాయబద్ధంగా ఫాతెహాను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పండుగలను, సంప్రదాయాలను సంరక్షించడానికి ప్రభు త్వం ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ ఆ ధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో స ర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు శివరామరాజు పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో…
కృష్ణ, ఆగస్టు 20 : మండలకేంద్రంతోపాటు హిందుపూర్, ముడుమాల తదితర గ్రామాల్లో మొహర్రం పండుగను ప్రజలు నిర్వహించారు. వారం రోజుల నుంచి గ్రామా ల్లో పీర్లను ఏర్పాటు చేసి చావిడీల ఎదుట అలాయి ఆడా రు. మతాలకతీతంగా పీర్లకు నైవేద్యం సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు. ఉత్సవాలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. గ్రామాల్లో పీర్ల ఊరేగింపు సందర్భంగా యువకులు నృత్యాలు చేశారు.
మరికల్ మండలంలో…
మరికల్, ఆగస్టు 20 : వారం రోజులుగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పీర్ల పండుగ శుక్రవారం ముగిసింది. మరికల్‌కు మధ్వార్ పీర్లు వచ్చి అలాయ్, బలాయ్ తీసుకున్నా యి. అనంతరం గ్రామంలో యువకులు అలయ్ ఆడుతూ మొహర్రం ఉత్సవాలను ముగించారు. మండలకేంద్రంతోపాటు మధ్వార్, తీలేరు, చిత్తనూర్, కన్మనూర్, పెద్దచింతకుంట, రాకొండ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పీర్లను నిమజ్జనానికి తరలించారు. మండలంలో మొహర్రం పం డుగ ప్రశాంతంగా ముగిసింది.
నారాయణపేట మండలంలో…
నారాయణపేట రూరల్, ఆగస్టు 20 : మండలంలోని జాజాపూర్‌లో నవమి సవారీ నిర్వహించారు. మౌలాలి చావిడీ, పంచ చావిడీల వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో సాహెబ్‌లు నడిచారు. రాత్రి జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి చాలా మంది భక్తులు పాల్గొని సందడి చేశా రు. శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు ని ర్వహించి పీర్లను ఊరేగించి నిమజ్జనం చేశారు. మహిళలు బొడ్డెమ్మ ఆడుతూ సందడి చేశారు.
ధన్వాడ మండలంలో…
ధన్వాడ, ఆగస్టు 20 : మండలంతోపాటు గోటూర్, కొండాపూర్, హన్మన్పల్లి తదితర గ్రా మాల్లో మొహర్రం ఉత్సవాలు ముగిశాయి. భక్తు లు పీర్లకు మొక్కుబడులు చెల్లించుకున్నారు. పీర్ల ను గ్రామంలో ఊరేగించి అలాయ్, బలాయ్ తీ సుకున్నాయి. గోటూర్లో పీర్ల పండుగ సందర్భంగా ఎస్సై రా జేందర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటన లు జరుగకుండా ప్రజలను సమన్వయం చేశారు.
నర్వ మండలంలో…
నర్వ, ఆగస్టు 20 : మండలంలోని నర్వ, రాయికోడ్, నాగిరెడ్డిపల్లి, రాంపూర్ తదితర గ్రామాల్లో మొహర్రం పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో సామరస్యంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో యువకులు అలాయ్ ఆడుతూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పీర్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.