భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు
ప్రశాంతంగా ఉత్సవాలు ముగిసేలా చూడాలి
విధులను సమర్థవంతంగా నిర్వహించాలి
ఎస్పీ డాక్టర్ చేతన
ఊట్కూర్, ఆగస్టు 19 : మొహర్రం ఉత్సవాల సందర్భం గా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ డాక్టర్ చేతన సూ చించారు. గురువారం, శుక్రవారం జరిగే హసన్, హుసేన్ పీర్ల సవారీ వేడుకలను పురస్కరించుకొని మండలకేంద్రం లో భారీ సంఖ్యలో పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చే శారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో వివిధ జిల్లాల నుంచి బందోబస్తుకు హాజరైన పోలీసులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వేడుకలు ప్రశాంత వాతారణంలో ముగిసేందుకు కృషి చేయాలని సూచించారు. మండలకేంద్రంలోని అన్ని ప్రధాన కూడళ్లలో పికెటింగ్ నిర్వహించాలని ఆదేశించా రు. పోలీసులు ఏమాత్రం ని ర్లక్ష్యం వహించకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ఎవరికీ కేటాయించిన స్థానాలలో వారే విధులను నిర్వర్తించాలని, ఉన్నతాధికారుల సూచనలు పాటించాలని ఆమె తెలిపారు. ఇద్ద రు డీఎస్పీలు, ఆరుగురు సీ ఐలు, 260 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లను నియమించామని తెలిపారు. కార్యక్రమంలో నారాయణపేట డీఎస్పీ మధుసూదన్‌రావు, మహబూబ్‌నగర్ డీఎస్పీ కిషన్, మక్తల్ సీఐ శంకర్, ఊట్కూ ర్ ఎస్సై పర్వతాలు పాల్గొన్నారు.
విధుల్లో సంయమనం పాటించాలి
నారాయణపేట, ఆగస్టు 19 : బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సంయమనం పాటించాలని ఎస్పీ చేతన సూచించా రు. ఊట్కూర్, పేట మండలాల్లో మొహర్రం పండుగ సందర్భంగా బందోబస్తుకు వచ్చిన అధికారులు, సి బ్బందితో పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించి భద్రతాపరమైన అంశాలపై సలహా లు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బందోబస్తు సమయంలో ఎలాంటి ఘ టనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుం డా చూడాలని, సెక్టార్ వైజ్‌గా తమకు కేటాయించిన ప్రాం తాల్లో విధులను నిర్వర్తించాలన్నారు. పీర్ల ఊరేగింపు సమయంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఊరేగింపు జరుగుతున్న సందర్భంలో ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రతి ఒక్కరిపై దృష్టి సారించాలన్నారు. బందోబస్తులో రెండు మండలాలు కలిపి ముగ్గురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 30 మంది ఎస్సై లు, 80 మంది ఏఎస్సైలు, 480 మంది పీసీలు, హెచ్‌జీలు, 70 మంది మహిళా పోలీసులు, 6 స్పెషల్ పార్టీలు, 3 టీఎస్ఎస్పీ ఫ్లటూన్లను కేటాయించినట్లు పేర్కొన్నారు.
బందోబస్తు పరిశీలన
పట్టణంలోని సింగార్భేస్ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు, మొహర్రం పండుగ సం దర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ చేతన పరిశీలించారు. పళ్ల, సింగర్భేస్లో ప్రార్థనా మందిరాల వద్ద నిర్వాహకుల తో ఎస్పీ మాట్లాడారు. భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకు సలహాలు, సూచనలు అందజేశారు.