ఘనంగా ఎదుర్కోళ్లు
ముస్తాబైన కల్యాణ మండపం
గద్వాలటౌన్, ఆగస్టు 30 : నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జమ్మిచేడు జములమ్మ కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూ ర్తయ్యాయి. తొలిసారి జరిపించనున్న కల్యాణోత్సవానికి ఆలయ ప్రాంగణాన్ని పాలకమండలి, అధికారుల ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వా గత తోరణం ఎదుట ఏర్పాటు చేసిన అమ్మవారి వి గ్రహం విశేషంగా ఆకట్టుకుంటున్నది. దారి పొడవునా ఏ ర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. పోతరాజుల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది.
ఘనంగా ఎదుర్కోళ్ల ఉత్సవం..
జములమ్మల కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం ఎదుర్కోళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. త్రిశూల రూపంలో జమదగ్ని మహర్షిని సాయంత్రం ప ల్లకీపై ఊరేగించారు. జమ్మిచేడు గ్రామంలోని శివాల యం వరకు ఊరేగింపు సాగింది. అక్కడ ఎదుర్కోళ్ల ఉ త్సవాన్ని నిర్వహించి తిరిగి జములమ్మ ఆలయానికి చే రుకున్నారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ సతీ శ్, సభ్యులు, ఈవో, సిబ్బంది పాల్గొన్నారు.