నిజామాబాద్ రూరల్, జనవరి 22 : నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం జీపీ నుంచి విడిపోయి నూతన గ్రామ పంచా యతీగా ఏర్పడిన శ్రీనగర్‌లో గ్రామపంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ.26.30లక్షలతో అన్ని హంగులతో నిర్మించిన భవనం త్వరలోనే అందుబాటులోకి రానున్నది. నిజామాబాద్ రూరల్ మండలంలో కొత్తగా ఏర్పడిన ఆరు గ్రామపంచాయతీల్లో సొంత భవనం నిర్మించుకున్న మొదటి జీపీగా శ్రీనగర్ నిలువనున్నది. కొత్త భవనం అందుబాటులోకి రా నుండడంతో ఎంతో సౌకర్యంగా మారిందని గ్రామపెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్జీఎస్ఏ పథకం కింద ఎంపిక..
వంద శాతం ఇంటి పన్ను వసూళ్లతోపాటు పచ్చదనం, పరిశుభ్రత నిర్వహణ, వైకుంఠధామం నిర్మాణాల్లో శ్రీనగర్ గ్రామం ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ్స్వరాజ్ అభియాన్ కింద జిల్లా వ్యాప్తంగా ఐదు గ్రామాలను ఎంపిక చేయగా అందులో శ్రీనగర్ జీపీ ఉండడం విశేషం. శ్రీనగర్‌తోపాటు మాక్లూర్ మండలంలోని వల్లభాపూర్, భీమ్‌గల్ మండలం కొత్త తండా, కోటగిరి మండలం హంగర్గ ఫారం, రెంజల్ మండలం నీలా పేపర్‌మిల్ గ్రామాలు ఎంపికయ్యాయి. ఒక్కో జీపీ భవన నిర్మాణానికి రూ.20లక్షలు ఆర్జీఎస్ఏ కింద మంజూరు చేశారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు టెండర్ నిర్వహించగా రూ.16.30లక్షలతో శ్రీనగర్‌లో కొత్తగా జీపీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామానికి చెందిన వీరారెడ్డి 120 గజాల స్థలా న్ని విరాళంగా ఇచ్చి గ్రామస్తుల మన్ననలు పొందారు. సర్పంచ్, కార్యదర్శి గదులు, సమావేశం హాల్‌తోపాటు ఓపెన్ హాల్‌ను పీఆర్ ఏఈ నరేశ్ పర్యవేక్షణలో నిర్మించారు. నిధులు సరిపోకపోవడంతో అదనంగా జీపీ నిధుల నుంచి రూ.10లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశారు.
కల నెరవేరింది
కొత్తగా ఏర్పడిన జీపీ కార్యాలయ కార్యకలాపాలను రామాలయం గుడికి సంబంధించిన రెండు గదుల్లో నిర్వహిస్తున్నాం. ఇరుకైన గదుల్లో సమావేశాలు జరుపుకోవడం ఇబ్బందిగా మారింది. తన హయాంలో జీపీ భవనం నిర్మించాలని అనుకున్నాను. అందుకనుగుణంగా 100శాతం ఇంటి పన్ను వసూలుతో పాటు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచాం. గ్రామం ఆర్జీఎస్ఏ కింద ఎంపికైం ది. జీపీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో పనులు పూర్తి చేశాం. త్వరలోనే ప్రారంభిస్తాం.
పంపు పోయి డ్రోన్ వచ్చే..
సిరికొండ, జనవరి 22 : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూమి దున్నడం నుంచి నాట్లు వేయడం, నూర్పిడి వరకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. రైతన్నల పనిని మరింత సులువు చేసేందుకు డ్రోన్లు రంగంలోకి దిగాయి. మండల కేంద్రానికి చెందిన కనగందుల గోపి డ్రోన్ ద్వారా పురుగుల మందును పిచికారి చేసి రైతుల దృష్టిని ఆకర్షించారు. డ్రోన్ వినియోగంతో సమయం ఆదా అవుతుందని, ఖర్చు కూడా తగ్గుతుందని రైతులు భావిస్తున్నారు.
మౌలిక వసతులకు పెద్ద పీట
అరకొర సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలను మెరుగుపర్చేందుకు రాష్ట్రప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం దాదాపుగా రూ.7వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించడం శుభపరిణామం. ప్రభుత్వ బడుల్లో వసతులను మెరుగుపర్చడం ద్వారా పిల్లలకు, మరీ ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు అత్యున్నతమైన ప్రమాణాలతో విద్యను అందించవచ్చు.