ఖలీల్వాడి, జనవరి 13 : నిజామాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొట్టింది. సాయంత్రం 6 నుంచి అరగంట పాటు ఏకధాటిగా జోరుగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని పలు చోట్ల వడగండ్ల వాన కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.