ముషీరాబాద్: కొణిదెల యువసేన ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీనటుడు చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొణిదెల అభిమాన సంఘం నాయకులు ఆర్.మోజస్, నాగరాజు, శ్రీనుబాబు, నరేష్, నాగేష్, సాల్మన్, వరుణ్, బి.విజయ్‌తోపాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.