E shram card | కార్మికులకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్

అత్తాపూర్ : కార్మికుల కర్షకులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందనని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన నిర్మాణ కార్మికసంఘం ఆధ్వర్యంలో 500 మంది కార్మికులకు గుర్తిం పు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైనా ఎమ్మెల్యే కార్మికులకు కార్డులను అంజేశారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కార్మికులకు ఏ కష్టం వచ్చిన తాను ఉన్నానని ఎవరికి ఎలాంటి సహయం కావాలన్న చేస్తానన్నారు. నియోజకవర్గంలో ఎంతోమంది కార్మికులకు ప్రభుత్వం నుండి సహయం అందించామని, మహిళ కార్మికులకు కంపెనీలలో పనివేళలను తగ్గించేలా చర్యలు తీసుకున్నమన్నారు.
పనికి తగిన వేతనం ఇప్పించామని ఆయన గుర్తుచేశారు. కార్మికులకు గుర్తింపు కార్డలను అందిస్తూ ఏదైనా ఆపద వస్తే కార్మిక కటుంబాలకు రక్షణ కోసం నగదు అందేవిధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన గుర్తుచేశారు. కార్మికులు గుర్తింపు కార్డులను నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు.
కార్మికసంఘం కూడా కార్మికులకు అండగా ఉండాలని కార్మిక సంఘం నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, జిల్లా నాయకుడు మిద్దెల సురేందర్ రెడ్డి, చెరకు అమరేదంర్, భవన నిర్మాణ కార్మికసంఘం గ్రేటర్ అద్యక్షుడు చెన్నయ్య, ఆటో యూనియన్ అధ్యక్షుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

