పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఓ ట్రెండ్‌గా మారింది. ప్రియమైన వారిపై ప్రేమను వ్యక్తపరిచే గుర్తుగా మాత్రమే కాకుండా వ్యక్తుల అంతరంగాన్ని, ఫిలాసఫీని ఆవిష్కరించే సాధనంగా టాటూ మారింది. అగ్ర కథానాయిక రష్మిక మందన్న చేతిపై ఇర్రీప్లేసబుల్ (భర్తీ చేయలేనిది) అనే టాటూ కనిపిస్తుంది. దీనిపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ ‘నాకు టాటూలపై అంతగా ఆసక్తి ఉండేది కాదు.
అయితే మా కాలేజీలో ఓ అబ్బాయి ‘ఆడవాళ్లకు సూదులంటే చాలా భయం. అందుకే వాళ్లు టాటూలకు కూడా భయపడతారు’ అని ఛాలెంజ్ చేశాడు. దాంతో ఇర్రీప్లేసబుల్ అనే టాటూ వేయించుకున్నా. నా దృష్టిలో మనతో పాటు ప్రతి ఒక్కరూ విలువైనవారే. ఎవరికి వారే ప్రత్యేకం. ఎవరూ మరొకరి స్థానాన్ని భర్తీ చేయలేరు. ఆ భావం స్ఫురించేలా టాటూ వేయించుకున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నది.