నాగర్‌కర్నూల్ జిల్లా కోనసీమగా మారుతోంది. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష సాధనతో జిల్లా స్వరూపమే
మారిపోయింది. బీడు భూములు, ముళ్ల చెట్లు,కరువు ఛాయలతో కనిపించిన నాటి పల్లెలు ఇప్పుడు
పచ్చని పంటలతో ధాన్యపు భాండాగారాలుగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న పాలనాపర నిర్ణయంతోకందనూలు జిల్లాకు మళ్లీ పూర్వ వైభవం రాగా..ఎంజీకేఎల్‌ఐతో జలసిరులు సంతరించుకున్నాయి. 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండడడంతో బంగారు పంటలు పండుతున్నాయి. ఎత్తయిన ప్రదేశంలో ఉన్నఅమ్రాబాద్కు కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉమామహేశ్వర, చెన్నకేశవ రిజర్వాయర్లకు త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నది. ఇక పాలమూరు ఎత్తిపోతల ద్వారా మరింత పచ్చదనం పర్చుకోనున్నది. దీంతో ఏడాది పొడవునా చెరువులు అలుగులు పారనున్నాయి. సేద్యం సంబురంగా మారగా.. సాగునీటి రంగంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా నిలవబోతున్నది.ఇలా నాలుగేండ్లలో 170 టీఎంసీలు ఎత్తిపోశారు.
నాగర్‌కర్నూల్, (జనవరి 19) నమస్తే తెలంగాణ : కం దనూలు.. కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్. ఒక్క పూట తిండికి నోచుకోని పేదలు వేలల్లోనే.. పల్లెల్లో తుమ్మ చెట్లు, చుక్కనీరు లేక మైదానంలా తలపించే చెరువులు.. ఎండాకాలం వస్తే తాగునీటి కోసం రాత్రింబవళ్లు కుళాయిలు, ట్యాంకర్ల వద్ద పడిగాపులు.. బిందెలతో రోడ్లు, ఆఫీసుల వ ద్ద ధర్నాలు.. ఇక సేద్యం బహుదూరం.. భూములన్నీ బీ ళ్లుగా పందులకు ఆవాసాలు.. దీంతో పదెకరాలున్న రైతు లూ పట్నంలో వలస కూలీలే.. తల్లిదండ్రులు, పిల్లలను ఇండ్ల వద్దే వదిలి కన్నీళ్లతో దేశంలో భవన నిర్మాణరంగం లో పని చేసేదీ ఇక్కడి పేదలే.. ఇవన్నీ గతం..
తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఈ కష్టాలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపించింది. సమైక్య పాలనలో, ఆంధ్రా పాలకుల శీతకన్నుతో ఎంజీకేఎల్‌ఐలో భాగంగా నిర్మించిన ఎ ల్లూరు రిజర్వాయర్ (0.35 టీఎంసీలు)ను హడావుడిగా ప్రారంభించారు. దీంతో పెండింగ్ ప్రాజెక్టుగా మారి కల్వకుర్తికి నీళ్లు వస్తాయా అని నమ్మకాలు సన్నగిల్లాయి. ఈ క్ర మంలో సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చర్యలతో ఏడాదిన్నరలోనే (2016లో) చేపట్టిన జొన్నలబొగుడ (2.14 టీఎంసీలు), గుడిపల్లి (0.96 టీఎంసీలు), సింగోటం శ్రీవారి సముద్రం (0.55 టీఎంసీలు) రిజర్వాయర్లు ప్రారంభమయ్యాయి. దీంతో నేడు ప్రతి ఏటా 450 వరకు పెద్ద చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. పంటల సాగు గణనీయంగా పెరిగింది. శ్రీశై లం బ్యాక్‌వాటర్ ఆధారంగా కొల్లాపూర్ మండలం ఎల్లూ రు గ్రామంలోని రేగుమాన్గడ్డ వద్ద 3.40 లక్షల ఎకరాల కు సాగునీరందించాలనే లక్ష్యంతో ఎంజీకేఎల్ఐ ప్రారంభమైంది. ఘణపురం బ్రాంచ్ కెనాల్, బుద్ధారం కుడి ప్రధాన కాలువ, కల్వకుర్తిలో చివరి డిస్ట్రిబ్యూటర్ డీ-82తోపాటు బిజినేపల్లిలో మార్కండేయ రిజర్వాయర్, అచ్చంపేట ని యోజవకర్గంలో ఎత్తైన ప్రాంతాలు అమ్రాబాద్, పదర, బ ల్మూర్కు సాగునీరు అందించేందుకు ఉమామహేశ్వర, మా ర్కండేయ రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఈ పనులకు త్వరలోనే శం కుస్థాపన చేయనున్నారు. నాలుగేండ్లలో నాగర్‌కర్నూ ల్ జిల్లాలో 170 టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు. మిషన్ కాకతీయ ద్వారా 1,567 చెరువులను పునరుద్ధరించారు. ఫలితంగా సాగు, తాగునీటి సమస్య తీరింది. దుందుభీ వాగు వద్ద సిర్సవాడ, పాపగల్, మేడిపూర్, ఉల్పర వద్ద పలు చెక్ డ్యాంలను నిర్మించారు. దీంతో భూగర్భ జలాలు పెరిగా యి. 2020లో ఎంజీకేఎల్ఐ ద్వారా 2.50 లక్షల ఎకరాలకు సాగునీరందించడం విశేషం. మత్స్యసంపద పెరిగిం ది. పశుగ్రాస సమస్య తీరింది. నిరంతర విద్యుత్, పుష్కలం గా సాగునీరు ఉండడంతో సేద్యం సంబురంగా మారింది. సొంత ఊరిలోనే పనులు దొరుకుతుండడంతో వలస వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకొని హాయిగా జీవిస్తున్నారు. 2021 వానకాలంలో జిల్లాలో 5.41 లక్షల ఎకరాల్లో పం ట సాగు చేశారు. యాసంగిలో 3.06 లక్షల ఎకరాలు సా గైంది. ఎంజీకేఎల్ఐ పూర్తికాక ముందు 2016-17 వానకాలంలో సాధారణ విస్తీర్ణం 1,98,106 హెక్టార్లు కాగా.. 2,23,934 హెక్టార్లలో సాగు చేశారు. యాసంగిలో సాధారణ సాగు 39,453 హెక్టార్లు కాగా.. 54వేలు సాగైంది. ఇ ప్పుడు సాగు రెట్టింపు స్థాయిలో పెరగడం గమనార్హం. ఇంతకుముందు ఎకరా రూ.లక్ష కూడా లేని చోట.. రూ.24 లక్షలు పలుకుతున్నది. గ్రామాల్లో గుడిసె లు మాయమయ్యాయి. పట్నాల్లో మేడలను త లపించేలా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నా యి. వ్యవసాయ క్షేత్రాల వద్ద ఫాంహౌస్ లు వెలుస్తున్నాయి. దీనంతటికీ ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టే మూల కారణం అనడంలో ఎలాం టి సందేహం లేదు. ఈ ప్రా జెక్టు జిల్లా ము ఖ చిత్రాన్నే
కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌లో బీడు భూములే కనిపించడం లేదు. పచ్చని పంటలతో కోనసీమను తలపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తైతే జిల్లా సాగునీటి రంగంలో రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకోనున్నది. ఇందులో భాగంగా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామంలో అంజనగిరి రిజర్వాయర్ (8.51 టీఎంసీలు), బిజినేపల్లి మండలం వట్టెం వద్ద వెంకటాద్రి (16.74 టీఎంసీలు) రిజర్వాయర్లు నిర్మాణమవుతున్నాయి. దీంతో మరో 1.40 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి రానున్నాయి. ఇలా జిల్లాలో దాదాపుగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నది. ఎంజీకేఎల్ఐతోపాటు పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులకు మూలస్తంభాలైన ఎల్లూరు, అంజనగిరి రిజర్వాయర్లు జిల్లాలోనే ఉండడం విశేషం. అంజనగిరి రిజర్వాయర్ నుంచి వనపర్తి జిల్లాలోని వీరాంజనేయ రిజర్వాయర్‌కు నీరు చేరుకుంటుంది. వట్టెం నుంచి కరివెన(కురుముర్తిరాయ), ఉదండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లకు సాగునీళ్లు అందుతాయి. రూ.వందల కోట్ల నిధులతో చేపట్టిన రిజర్వాయర్లు, టన్నెళ్లు, కాల్వల పనులు చురుకుగా సాగుతున్నాయి. మిషన్ భగీరథతో జిల్లాలో 700 వరకు ఆవాసాలతోపాటు హైదరాబాద్ వరకు తాగునీరు అందించే కేంద్రం కూడా కొల్లాపూర్‌లోనే ఉండడం గమనార్హం. ఇలా కృష్ణానది సాగు, తాగునీటి రంగంలో నాగర్‌కర్నూల్ జిల్లాతోపాటు రాష్ర్టానికీ ప్రాణదాయనిగా మారింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎంజీకేఎల్ఐ, పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులు కరువు నిలయంగా మారిన కందనూలు కోనసీమగా మారుతున్నది.