Uppala foundation | మౌత్ ఆర్టిస్ట్ స్వప్నికకు ఆర్థిక చేయూత

మన్సూరాబాద్ : రెండు చేతులు లేకున్నా నోటితో బొమ్మలు గీస్తున్న మౌత్ ఆర్టిస్ట్ కె. స్వప్నికకు ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. శ్రీకాకుళంకు చెందిన కొవ్వాడ సరస్వతి తమ కుమార్తె కె. స్వప్నికతో కలిసి నగరానికి వచ్చి ప్రస్తుతం బంజారాహిల్స్లో నివాసముంటున్నారు.
రెండు చేతులు లేనప్పటికీ స్వప్నిక మొక్కవోని పట్టుదలతో నోటితో బొమ్మలు గీస్తూ అందరి మన్ననలు పొందింది. తండ్రి మృతిచెందడం, తల్లికి మూర్చ వ్యాధి ఉండటంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని కొందరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన ఆయన సోమవారం ఉప్పల ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో రూ. 20 వేలను స్వప్నికకు అందజేశారు. ఈ సందర్భంగా కె. స్వప్నిక తన నోటితో గీసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో ఎం. నందకిషోర్, బి. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

