ఎల్బీనగర్ : ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో పేదలు, అనాథలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
చలి తీవ్రత నేపథ్యంలో ది సురక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హజరై దుప్పట్లు పంపిణీ చేశారు. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ పరిసరాల్లో రోడ్ల పక్కన పుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న పేద, అనాథలకు దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, ది సురక్ష ఫౌండేషన్ ప్రతినిధులు మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సాయికుమార్, యాద శంకర్, చందు, వాసిరెడ్డి , ప్రీతం, సాగర్, వెంకటేష్, రాకేష్, కార్తిక్, అఖిల్, మణి తదితరులు పాల్గొన్నారు.