
జడ్చర్ల టౌన్, జనవరి 12 : జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువజన రజతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ వేషధారణలతో విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శనలు అలరించాయి. వివేకానందుడి సూక్తులు, సంక్రాంతి సందర్భం గా విద్యార్థులు చేసిన నాటికలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులు ఆట, పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ మాట్లాడుతూ యువజన రజతోత్సవాల సందర్భంగా విద్యార్థుల్లో కళాప్రతిభను చాటుకునేందుకు అవకాశం లభిస్తుందన్నా రు. ధైర్యమే బలమని, బలహీనతే మరణమని.. వివేకానందుడి సూక్తులను స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తీసుకొని ధైర్యంగా కరోనాతో పోరాటం చేయాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సదాశివయ్య, సుభాషిణి, భార్గవి, లత, పరిశోధక విద్యార్థులు రామకృష్ణ, తిరుపతి, రమాదేవి, శివకుమార్, శంకర్ ఉన్నారు.