
మహబూబ్‌నగర్, జనవరి 12 : కరోనాపై నిర్లక్ష్యం వీడి అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అ న్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ని ర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ఒమ్రికాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు వందశాతం పూర్తయిందని, రెండోడోసు 68శాతం పూర్తయిందని తెలిపారు. అలాగే 15-17ఏండ్ల వయస్సున్న వారికి 64శాతం లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు. కరోనా బాధితులకోసం గ్రామ, పట్టణ ప్రాం తాల్లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖలో బదిలీపై వచ్చిన వారందరూ విధుల్లో చేరేలా చూడాలని తెలిపారు. గర్భిణులకు ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. వీసీలో డీఎంహెచ్‌వో కృష్ణ, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో యాదయ్య తదితరులు ఉన్నారు.
ఈ-శ్రామ్‌లో నమోదు చేయాలి
అసంఘటత రంగంలో పనిచేసే కార్మికులు ఈ-శ్రామ్ పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఈ-శ్రామ్ నమోదు తో ప్రమాదవశాత్తు చనిపోయినా, అంగవైకల్యం కలిగినా ఇన్సూరెన్స్ వస్తుందని తెలిపారు. పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే కార్మికులు నమోదు చేసుకునేలా అధికారులు అ వగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కా ర్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ ఉన్నారు.
అవగాహన ఉండాలి
ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌పై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఉపాధి హామీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌పై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ శిక్షణా తరగతులకు హాజరై మాట్లాడారు. పే ఆర్డర్ జనరేషన్, ఎఫ్‌టీవో జనరేషన్, తీర్మానాల నమో దు, పనికి ముందు.. తర్వాత ఫొటోలు తీయడం, చెల్లింపుల నమోదుపై అవగాహన పెంచుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో డీఆర్డీవో యాదయ్య పాల్గొన్నారు.