‘ఉద్యోగం సాధించాలనే తపనతో పాటు ప్రణాళికాబద్దంగా చదివితే గ్రూప్స్‌లో విజయం పెద్ద కష్టమేమీ కాదు.. మానసిక ఒత్తిడికి గురికాకుండా లక్ష్యాన్ని సాధించాలి.’అని కోదాడ పట్టణానికి చెందిన గ్రూప్ 1 విజేత కొండపల్లి శ్రీరాం
తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తరుణంలో నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి శ్రీరాం పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లాలో ఉపాధి కల్పన శాఖ అధికారిగా పనిచేస్తున్నారు.